ఏకంగా కరోనానే వణికిస్తున్న ఆ మహిళా సర్పంచ్..ఏం చేసిందో తెలిస్తే?

కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందన్న విషయం తెలిసిందే.కరోనా బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

 Do You Know What The Female Sarpanch Who Was Trading Corona Alone Did, Corona Se-TeluguStop.com

మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు మాత్రం తీవ్రంగా నమోదవుతున్నాయి.

అందుకే గ్రామాల్లో, పట్టణాల్లో కేసులు భారీగా నమోదవడం మొదలయ్యాక ఎవరికి వారు లాక్ డౌన్ విధించుకోవడం మొదలు పెట్టారు.అయితే చాలా గ్రామాలలో కరోనా కేసులు నమోదవడం మొదలైనా లాక్ డౌన్ విధించుకోవడంతో కొద్ది మేర కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు.

రాజస్థాన్ లోని తుంగేతెహిసిల్ గ్రామంలో 9,000 మంది జనాభా ఉన్నారు.

ఈ గ్రామ సర్పంచ్ గా క్రిష్ణ గుప్త కరోనా పట్ల యుద్ధం ప్రకటిస్తున్నారనే చెప్పవచ్చు.

ఈ గ్రామంలో ఇప్పటికి 16 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయంటే ఎంత పకడ్భంధీ చర్యలు తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.ఊరిలో లౌడ్ స్పీకర్లతో వ్యాక్సిన్ పై, కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కరోనా బారిన పడితే జరిగే నష్టాన్ని గ్రామస్థులకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

అంతేకాక స్వయం సహాయతా సమూహ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఊరిలో ఉన్న అందరు మహిళలు ఉండడంతో ఏ పరిస్థితి ఎవరికీ ఎలాంటిది వచ్చినా గ్రూప్ లో సర్పంచ్ క్రిష్ణ గుప్త గైడ్ చేస్తుంటుంది.గ్రామంలో నిరుపేదలు కరోనా బారిన పడితే వారికి సబ్బులు, శానిటైజర్లు ఉచితంగా అందించి వారు కోలుకునే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సర్పంచ్ క్రిష్ణ గుప్త.

ఇంతటి గొప్ప చర్యలు తీసుకుంటే కరోనా ఎలా వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube