అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి చిత్రం

హాలీవుడ్ లో సినిమాలు అంటే వందల కోట్ల బడ్జెట్ తో సూపర్ నేచురల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కిస్తూ ఉంటారనే విషయం అందరికి తెలిసిందే.టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా అడ్వాన్స్ కథలతో తెరపై కథలని ఆవిష్కరిస్తూ ఉంటారు.

 Russia Picks Team For Film Shot On International Space, Hollywood, Tom Cruise, N-TeluguStop.com

అలాగే మన కంటికి కనిపించని ప్రపంచాల్ని క్రియేట్ చేస్తూ వినోదాన్ని అందిస్తూ ఉంటారు.ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ మంది వీక్షించాడానికి ఇష్టపడుతూ ఉంటారు.

హాలీవుడ్ అంటే ఒక్క అమెరికా మాత్రమే కాకుండా రష్యా నుంచి కూడా ఇంగ్లీష్ మూవీస్ తెరకెక్కుతూ ఉంటాయి.ఈ రెండు దేశాల మధ్య హాలీవుడ్ సినిమాల విషయంలో ఎప్పుడూ కూడా పోటీ వాతావరణం ఉంటుంది.

బడ్జెట్ అండ్ టెక్నాలజీ విషయంలో రెండు దేశాలకి చెందిన టెక్నిషియన్స్ పోటీ పడుతూ సినిమాలు చేస్తూ ఉంటారు.ఇప్పటికే సినిమాల పరంగా ఎన్నో అద్బుతమైన కథలని చూపించి, ఫాంటసీలో కూడా అడ్వాన్స్ స్టాండర్డ్స్ ని ఆవిష్కరించిన హాలీవుడ్ లో అంతరిక్షం నేపధ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో షూటింగ్ చేయడానికి కొంత మంది ప్లాన్ చేస్తున్నారు.అమెరికాలో వార్ అండ్ యాక్షన్ చిత్రాల హీరో టామ్ క్రూజ్ అంతరిక్షంలో ఒక సినిమా షూట్ చేయాలని భావించి ఇప్పటికే నాసాతో ఒప్పందం చేసుకున్నాడు.

అయితే వారికంటే ముందుగా అంతరిక్షణంలో మొదటి చిత్రాన్ని తెరకెక్కించడానికి రష్యా రెడీ అవుతుంది.మొదటి చలనచిత్రం చేయడానికి నటులను దర్శకుడిని అంతరిక్షంలోకి పంపిస్తామని గురువారం తెలిపింది.అందులో భాగంగా అంతరిక్షంలో తొలి చలనచిత్రం చేయడానికి నటి, దర్శకుడిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అక్టోబర్‌లో పంపాలని రష్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.ఈ అంతరిక్ష రష్యన్ సినిమాకు ఛాలెంజ్ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు.

ఈ సినిమాలో ప్రముఖ రష్యన్ నటి యులియా పెరెసిల్డ్‌తో పాటు దర్శకుడు, నటుడు క్లిమ్ షిపెంకో నటించనున్నారు అని రోస్కోస్మోస్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube