హైదరాబాద్ సిటీ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విభజన చట్టం ప్రకారం హైదరాబాదు పై ఏపీకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి అని తెలిపారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన అంబులెన్స్ లు తెలంగాణ పోలీసులు సరిహద్దుల వద్ద ఆపడాని ఖండించారు.

 Ap Bjp President's Sensational Remarks On Hyderabad City Andhra Pradesh, Bjp, Kc-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవాలి అని.మానవత్వం చూపించాల్సిన సమయం అని తెలిపారు.ప్రపంచంలో పలు దేశాలు ఈ వైరస్ ని ఎదుర్కోవడం కోసం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఉన్నారని తెలిపారు.ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం గత నాలుగైదు రోజులుగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలను హైదరాబాద్ రాష్ట్రంలో రానివ్వకుండా ఆంక్షలు విధించటం .సరిహద్దుల వద్ద అడ్డుకోవటం దారుణం అని తెలిపారు.

హైదరాబాద్ ఓ మెడికల్ హబ్.పైగా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని.ఇది కేసిఆర్ సొత్తు కాదు.

ఆయన అబ్బ సొత్తు కాదు .విభజన సమయంలో వ్యవహరించినట్లు వ్యవహరించ కూడదని కేసీఆర్ ని సోము వీర్రాజు హెచ్చరించారు.రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయని.వైద్యం పౌరుడు యొక్క ప్రాథమిక హక్కు అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.ఇతర దేశాలకు చెందిన వారిని అడ్డుకుని తెలంగాణ పోలీసులు మరియు ప్రభుత్వం ఏపీ ప్రాంత ప్రజలను అడ్డుకోవటం దారుణమని కచ్చితంగా.మూల్యం చెల్లించుకుంటారు అంటూ హెచ్చరించారు.

ఈ విషయానికి సంబంధించి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడటం జరిగిందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube