మరో సారి కరోనా బారిన పడ్డ టీమ్​ ఇండియా క్రికెటర్..!

కరోనా వల్ల ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే మళ్లీ మ్యాచులను నిర్వహించి ఐపిఎల్ ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

 Carona Virus, Covid Positve, Sahoo, Indian Crickter, Sports, Ipl, Ipl,latest  Ne-TeluguStop.com

ఇదిలా ఉండగా క్రికెటర్ల ఇంట్లో కరోనా కలకలం రేపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఐపిఎల్ లో కూడా కొందరు క్రీడాకారులకు కరోనా నిర్దారణ కావడం వల్ల వాయిదా పడింది.

తాజాగా టీమ్​ఇండియా క్రికెటర్​ వృద్ధిమాన్​ సాహాకు రెండోసారి జరిపిన పరీక్షల్లోనూ కొవిడ్ నిర్ధరణ అయింది.ఐపీఎల్​ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్​ రెండు వారాల పాటు ఐసోలేషన్​లో ఉన్నాడు.

అయినప్పటికీ రెండోసారి నిర్వహించిన టెస్ట్​లోనూ అతనికి వైరస్​ ఉన్నట్లు తేలింది.దీంతో సాహా దిల్లీలోని హోటల్​ గదికే పరిమితమయ్యాడు.

త్వరలోనే మరో విడత పరీక్షలు చేయనున్నారు.సోమవారం నాటికి క్వారంటైన్​ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో కూడా సాహాకు కరోనా సోకిన విషయం తెలిసిందే.ఆ సమయంలో అన్ని ముందుస్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా వైరస్ ఎలా సోకిందో అర్థం కావ‌డం లేదని ఆ టీమ్ మెంటార్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.

స‌న్‌రైజ‌ర్స్ టీమ్ యాజ‌మాన్యం కూడా ఇప్ప‌టికీ అదే షాక్‌లో ఉన్న‌ద‌ని వెల్ల‌డించాడు.ఇంత క‌ఠిన‌మైన బ‌బుల్‌ను కూడా ఛేదించి వ‌చ్చిందంటే క‌రోనాపై పోరులో ఇది తమకు ఓ గుణపాఠం లాంటిద‌ని హైదరాబాద్ మెంటార్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఇదిలా ఉండగా ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​ కోసం ప్రకటించిన భారత జట్టులో సాహాకు చోటు కల్పించింది బీసీసీఐ.ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్​గా తేలడం ఆందోళన కలిగించే విషయమే.

జూన్​ 2న భారత జట్టు ఇంగ్లాండ్ బయల్దేరనుంది.ఆ సమయానికి సాహా ఫిట్​నెస్​ నిరూపించుకుంటేనే డబ్ల్యూటీసీ మ్యాచ్​లో ఆడతాడు.

లేకుంటే ఆటను ఆడే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube