సరికొత్త తరహాలో పార్లమెంట్ సమావేశాలు..??

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి.సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకు కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Parliamentary Sessions In The Latest Style Corona Virus, Parliament Meetings, De-TeluguStop.com

ఒకే కుటుంబానికి చెందిన వారైనా గానీ ఈ వైరస్ వచ్చాక ఒకరితో ఒకరు  మాట్లాడుకునే పరిస్థితి లేదు.దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగుల చేత పని చేపిస్తున్నారు.

సామూహికంగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రముఖ కంపెనీలు మరియు విద్యాసంస్థలు ఇంటి నుండే వర్చువల్ విధానం ద్వారా పని చేస్తున్నారు.

కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే వర్చువల్ విధానం ద్వారా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ  ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా త్వరలో దేశంలో పార్లమెంట్ సమావేశాలు కూడా వర్చువల్ విధానం ద్వారా నిర్వహించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఢిల్లీ లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో .పాటు ఒకే చోట గుమిగూడ‌టం వల్ల మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వర్చువల్ సమావేశం ద్వారా పార్లమెంట్ సభలు నిర్వహించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు త్వరలో ప్రకటన రానున్నట్లు సమాచారం. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube