వర్క్ ఫ్రమ్ హోటల్ గురించి మీకు తెలుసా...ఎక్కడంటే..?

కరోనావైరస్ అంతటా విలయతాండవం చేస్తోంది.కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.

 Work From Hotel, Viral News, Whm, Carona Effct, Viral Latest, Kerala,latest-TeluguStop.com

సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలు బోర్ అంటూ పనిపై నిరాశ, నిస్పృహను వెళ్లగక్కుతున్నారు.

ఈ సమయంలోనే సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయపెడుతోంది.ఇలాంటి తరుణంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడితే ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ ఉందంటూ ప్యాకేజీని సైతం ప్రకటించింది.ఈ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు.

గతేడాది కూడా పాపులర్ అయింది.

ఇప్పుడు ఐఆర్‍సీటీసీ టూరిజం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.

కేరళలోని హోటళ్లలో కొన్ని రోజుల పాటు ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకునేందుకు ప్యాకేజీని ప్రకటించింది.ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ప్రకటించిన వివరాల ప్రకారం.‘వర్క్ ఫ్రమ్ హోటల్’ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,126.ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధరగా ప్రకటించింది.ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ఐదు రాత్రులు హోటల్‌లో బస, మూడు పూటలా భోజనం, రెండు సార్లు టీ లేదా కాఫీ, వైఫై సదుపాయం ఉంటుంది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఎలాంటి సైట్ సీయింగ్ ఉండదు.ఈ ప్యాకేజీలో కేవలం హోటల్‌లో ఉంటూ పని చేసుకోవాల్సి ఉంటుంది.ఖాళీ సమయంలో హోటల్‍లోని వాతావరణాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి.ప్రస్తుతం కేరళలోని హోటళ్లలో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube