ఈసారి కూడా ఇంటిలోనే రంజాన్..!!

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రంజాన్. ముస్లిం ప్రజలు చేసుకునే ఈ పండుగ చాలా భక్తిశ్రద్ధలతో చేస్తూ దాదాపు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు ఉంటూ ఉంటారు.

 Ramadan At Home This Time Too Corona, Lock Down, Ramadan, Muslims , Famous Fasti-TeluguStop.com

రంజాన్ మాసంలో అనేక దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళ ఆదుకుంటారు.ప్రపంచంలో ఎంతోమంది ముస్లింలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు.

ఇదిలా ఉంటే ప్రపంచంలోకి ఎప్పుడైతే కరోనా మహమ్మారి అడుగు పెట్టడం జరిగిందో అప్పటి నుండి పరిస్థితులు మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే.

గత ఏడాది కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఇళ్లలోనే రంజాన్ పండుగ ముస్లింలు జరుపుకున్నారు.

ఈసారి కూడా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తూ ఉండటంతో.దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి.ఇదే తరుణంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో దేశంలో చాలా రాష్ట్రాలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించకూడదని కరోనా ఆంక్షలు విధించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముస్లిం సామాజిక వర్గం ఈసారి కూడా రంజాన్ పండుగను ఇంటిలోనే జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తూ ఉండటంతో .జనాలు ఎవరు కూడా పెద్దగా బయటకు రావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube