వారి మోసాన్ని మర్చిపోలేకపోతున్న జగన్ ?  

తనను నమ్మి తన వెంట నడిచిన వారికి జగన్ పల్లకి ఎక్కించినా, ఎక్కించకపోయినా వారి ప్రాధాన్యం కు మాత్రం ఎటువంటి డోకా లేకుండా చూసుకుంటూ,  ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో వారికి మేలు జరిగేలా చేస్తారు.కానీ తాను నమ్మి అన్ని రకాలుగా ప్రాధాన్యం ఇచ్చిన వారు చివరకు తనను మోసం చేస్తే,  జగన్ ఏ మాత్రం ఉపేక్షించరు.

 Jagan Is Already Angry About Those Who Won In Ycp And Joined Tdp , Akhila Priya,-TeluguStop.com

వారికి ఏ రకంగా ట్రీట్ మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చి తీరుతారు.ఇది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది.2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు,  ముగ్గురు ఎంపీలు అప్పటి అధికార పార్టీ టిడిపి లో చేరిపోయారు.వీరిని చేర్చుకునేందుకు భారీగా తాయిలాలు ఇవ్వడంతో పాటు, మరి కొంత మందికి మంత్రి పదవులు సైతం ఇచ్చారు.

అలా మంత్రి పదవులు పొందిన వారిలో జగన్ కు అత్యంత సన్నిహితులు,  కొంతమంది బంధువులు ఉన్నారు.అయినా వారు టిడిపి వైపు వెళ్ళి పోవడం జగన్ కు చాలా బాధ కలిగించింది.

ఇక వారిలో చాలా మందికి 2019 ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు.కొంతమందికి దక్కినా వారంతా ఘోర పరాజయం పాలయ్యారు.

ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ,  పార్టీ సీనియర్ల ద్వారా జగన్ పై ఒత్తిడి పెంచుతున్నా, జగన్ మాత్రం వారిని చేర్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయితే కొంతమంది ఎన్నికలకు ముందు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడంతో,  వారిలో కొంతమందిని పార్టీలో చేర్చుకున్నారు.

కానీ వారికి టిక్కెట్లు కానీ, ప్రాధాన్యం కానీ ఇవ్వకుండా జగన్ పక్కన పెట్టారు.అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారికి జగన్ ప్రాధాన్యత కల్పించారు.

Telugu Akhila Priya, Butta Renuka, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political Ne

ఎంతోమందిని ఎమ్మెల్సీలను చేశారు.కానీ, మోసం చేసి వెళ్ళిపోయిన 23 మంది విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా ఉండేందుకు ఇష్టపడడం లేదు.ఇక 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బుట్ట రేణుక,  తర్వాత టిడిపి లోకి వెళ్ళినా, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.అయితే ఆమెకు టికెట్ ఇవ్వలేదు సరికదా, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఇక జగన్ బంధువు, మాజీ మంత్రి అఖిల ప్రియ వైసీపీ లోకి వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నా , ఆమెకూ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు జగన్.తాను ఇంతగా  నమ్మిన వాళ్లే  మోసం చేయడం పై  ప్పటికే జగన్ మర్చిపోలేకపోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube