తెలుగు రాష్ట్రాల్లో ఆరు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. !

గత సంవత్సరం కోవిడ్ ఫస్ట్ వేవ్ వల్ల నిద్రావస్దలోకి వెళ్లిన ప్రపంచం మళ్లీ కోలుకుంటున్న సమయం లో కరోనా సెకండ్ వేవ్ అంటూ బలాన్ని పుంజుకుని వచ్చి ప్రజల జీవితాల్ని చీకట్లోకి నెట్టి వేసింది.ముఖ్యంగా భారత్ మాత్రం ఈ సెకండ్ వేవ్ దాటికి తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటుంది.

 South Central Railway, Cancelled, Six Trains, Ap, Telangana-TeluguStop.com

ఒక నాయకుని సమర్దత ఇలాంటి పరిస్దితుల్లోనే బయటపడుతుంది.మాటలు చెప్పి ఓట్లు రాబట్టుకోవడంలో కాదు.

ఇకపోతే ఈ కోవిడ్ వల్ల లాక్‌డౌన్ వల్ల చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారట.దీనివల్ల పలు రైళ్లు బోసిపోతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుందట.

ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిందని సమాచారం.

ఆ రైళ్ల వివరాలు తెలుసుకుంటే.

నేటి నుంచి ఈ నెల 31 వరకు విశాఖపట్టణం-కడప (07488) రైలు, రేపటి నుంచి జూన్ 1 వరకు కడప-విశాఖ రైలు (07487)ను రద్దు చేసినట్లు వెల్లడించింది.ఇవే కాకుండా ముంబై సీఎస్‌టీ-ఆదిలాబాద్ (01141) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీ నుంచి, ఆదిలాబాద్-ముంబై సీఎస్‌టీ (01142) రైలును 18 నుంచి, విశాఖ-లింగంపల్లి (02831), లింగంపల్లి-విశాఖ (02832) రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube