' జూనియర్ ' ని కలవరిస్తున్న టీడీపీ సీనియర్ ? 

ఎంత వద్దనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా ఉండడం లేదు.ఏదో ఒక నాయకుడు, ఏదో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లో మళ్ళీ యాక్టీవ్ కావాలని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, టీడీపీకి పునర్ వైభవం రావాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యం అవుతుంది అని పదేపదే టిడిపి నాయకుల నుంచి డిమాండ్ లు వినిపిస్తూ ఉంటాయి.

 Gorantla Butchaiah Choudary Tweets About Junior Ntr Health Condition, Gorantla B-TeluguStop.com

కానీ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలో యాక్టీవ్ అయితే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ గండి పడుతుంది అనే టెన్షన్ బాబు కి ఉంది.అందుకే పార్టీ నాయకులు ఎవరూ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై నోరు మెడపవద్దు అనే సూచనలు ఇస్తున్న, టిడిపి సీనియర్లు కొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు.

ఇక టిడిపి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే సందర్భం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వస్తూ, ఆయన పార్టీలో యాక్టివ్ కావాలని, తన మనసులో మాటను బయట పెడుతూ ఉంటారు.


కొద్ది నెలల క్రితమే ఈ విధమైన వ్యాఖ్యలు బుచ్చయ్య చేశారు.

సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ ప్రస్తావన పదే పదే తీసుకు వస్తూ ఉంటారు.తాజాగా కరోనా వైరస్ ప్రభావం కి గురైన జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి అంటూ బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అయితే ఇదే రకమైన పోస్ట్ ను అటు చంద్రబాబు ఇటు లోకేష్ సైతం పెట్టినా, మిగతా నాయకులు పెద్దగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆసక్తి చూపించలేదు.కానీ బుచ్చయ్య మాత్రం జూనియర్ జపం చేస్తూనే ఉండడం పార్టీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

లోకేష్ నాయకత్వం లో పని చేయడం ఇష్టం లేకనే బుచ్చయ్య ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.


అయితే వేరే నాయకుడు ఎవరైనా అయితే బాబు రియాక్షన్ వేరేగా ఉండేది.

కానీ చంద్రబాబు కంటే బుచ్చయ్య పార్టీలో సీనియర్ వ్యక్తి కావడం, మొదటి నుంచి టీడీపీకి సంబంధించిన అన్ని అంతర్గత వ్యవహారాలలో ఆయన జోక్యం ఉండడం వంటి వ్యవహారాలతో పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దు అంటూ హెచ్చరికలు చేయడం తప్పించి, గట్టిగా వార్నింగ్ ఇచ్చే సాహసం సైతం చంద్రబాబు చేయలేకపోతున్నారు.ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం చంద్రబాబుకు ఇప్పుడే కాదు ముందు ముందు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube