మరోసారి వీరికి టికెట్ కష్టమే ? జగన్ నమ్మకం కోల్పోయారే ?

ప్రస్తుతం జగన్ ప్రభంజనం నడుస్తోంది.2019 లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు.దానికి తగ్గట్లుగానే ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూర్చుతూ , ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.అయినా రావాల్సినంత స్థాయిలో పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ రాకపోవడంపై కొద్ది రోజులుగా జగన్ సీరియస్ గా దృష్టిపెట్టారు.దీనికి కారణం కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల తీరే కారణం అనే విషయాన్ని జగన్ గ్రహించారు.2019 ఎన్నికలలో వైసిపి టికెట్లు దక్కించుకున్న వారిలో చాలామంది కొత్తవారు ఉన్నారు.ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, రాజకీయ నేపథ్యం లేకపోయినా, జగన్ ఎంతో మందికి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం కల్పించారు.వారంతా గెలవడమే కాదు కొంతమంది మంత్రిపదవులు దక్కించుకున్నారు.

 Jagan Is Dissatisfied With The Perfomence Of Many Party Mlas ,ap,ap,ap, Ap Gover-TeluguStop.com

ఆ మంత్రులు ఎమ్మెల్యేల లో చాలామంది అవినీతి వ్యవహారాలు పాల్పడుతుండడం, పార్టీ ని పెద్దగా పట్టించుకోకపోవడం, పార్టీ కార్యకర్తలను అంతగా పట్టించుకోకుండా వ్యవహారాలు చేస్తుండడం, ఇలా ఎన్నో కారణాలతో కొంతమంది ఎమ్మెల్యేలపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీనికితోడు నిఘా వర్గాల ద్వారా వచ్చే రిపోర్టులలోనూ వారి పనితీరు అంతంత మాత్రంగా ఉన్నట్టు తేలడం ఇటువంటి వ్యవహారాలన్నీ జగన్ వరకు వచ్చాయి.

ఇప్పటికీ కొంతమంది పనితీరుపై హెచ్చరికలు పార్టీ సీనియర్ల ద్వారా చేయించినా, చాలా మందిలో మార్పు కనిపించకపోవడం వంటి కారణాలతో 2024 లో జరగబోయే ఎన్నికలలో దాదాపు 100 మందికి పైగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్లు దక్కకపోవచ్చు అనే వార్త ఇప్పుడు వైసీపీ లో సంచలనంగా మారింది.

Telugu Ap, Jagan, Mla Tickets, Ysrcp-Telugu Political News

అసలు తాను ఆశించిన విధంగా ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని జగన్ ఆగ్రహంగా ఉన్నారు.వారి తీరు కారణంగా వేల కోట్లు వివిధ పథకాల రూపంలో అందిస్తున్నా, జనాల నుంచి ఆదరణ ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణం క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలే అనే విషయాన్ని జగన్ గ్రహించారు.అందుకే ఈ రెండున్నరేళ్ల కాలంలో పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేయాలని, పార్టీ, ప్రభుత్వ అభిరుచికి అనుగుణంగా నడుచుకుని వారిపై వేటు వేయాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నఎమ్మెల్యేల లిస్ట్ పెద్దగా ఉండడంతో, ఎవరి సీటుకి ఎర్త్ పడుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube