సోనూసూద్ రియల్ హీరో ఇమేజ్ ని అందుకోలేకపోతున్న దర్శకులు

కరోనా సిచువేషన్ లో సోనూసూద్ ఇమేజ్ ఊహించని విధంగా పెరిగిపోతుంది.గత ఏడాది లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీలలో అందరికంటే ముందుగా బయటకొచ్చి సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం అయ్యాడు.

 Sonu Sood Real Hero Image Problem To Directors, Tollywood, Bollywood, Corona Sec-TeluguStop.com

వలస కార్మికులని సొంత గ్రామాలకి చేర్చడం ద్వారా ఒక్కసారిగా నేషనల్ వైడ్ హీరో అయిపోయాడు.సొంత డబ్బుతో ఏకంగా వలస కార్మికులని గమ్యస్థానాలకి చేర్చారు.

అప్పటి నుంచి తన సేవా కార్యక్రమాలని విస్తృతం చేస్తూ రియల్ హీరో అనే ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.సినిమాలలో విలన్ గా నటించిన నిజమైన హీరో అంటే సోనూసూద్ అని అందరూ ప్రశంసించేస్థాయిలో తన మానవత్వం చాటుకుంటూ వస్తున్నాడు.

బాలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ కేవలం ఎంతో కొంత విరాళం ప్రకటించి చేతులు దులుపుకుంటే తాను మాత్రం అన్ని ముందుండి చేస్తూ బాద్యతగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.ఒక స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి తన సేవని మరింత విస్తృతం చేస్తున్నాడు.

ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.అలాగే సీరియస్ కండిషన్ లో ఉన్న కరోనా పేషెంట్స్ గురించి తన దృష్టికి వస్తే వెంటనే స్పందించి వారికి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక సొంతగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నాడు.మొత్తానికి సోనూసూద్ తన వ్యక్తిత్వంతో రియల్ హీరో ఇమేజ్ దర్శకులకి ఇబ్బందికరంగా మారుతుంది.అతన్ని విలన్ పాత్రల కోసం గతంలో తీసుకునే వారు అయితే ఇప్పుడు స్టార్ హీరోలకి ఉన్న స్థాయిలో సోనూసూద్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అతని కోసమే సినిమాలు చూడటానికి కూడా వెళ్తున్నారు.

దీంతో సినిమాలో అతన్ని విలన్ గా రిప్రజెంట్ చేస్తే అసలుకే ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.ఏకంగా చిరంజీవి ఆచార్య సినిమాలో ముందుగా విలన్ పాత్ర కోసం అతన్ని ఎంపిక చేసి తరువాత క్యారెక్టరైజేషన్ పూర్తిగా మార్చేసి పోజిటివ్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయాల్సి వచ్చింది.

అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా దర్శకుడు అతన్ని విలన్ గా చూపించలేక హీరోగా చేయలేక కన్ఫ్యూజ్ అయ్యాడని సినిమా ఫలితం బట్టి అర్ధమవుతుంది.ఇప్పుడు సోనూసూద్ చేసే సినిమాలన్నింట అదే పరిస్థితి ఉంది.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో అయితే సోనూసూద్ ని హీరోగానే సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు రెడీ అయిపోతున్నారు.ఆయన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నారు.

మొత్తానికి భవిష్యత్తులో సౌత్, బాలీవుడ్ సినిమాలలో సోనూసూద్ ని విలన్ గా చూపించే ధైర్యం దర్శకులు చేయకపోవచ్చనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube