ఆ పని చేయపోతే చాలా కష్టం...నటి ఎమోషనల్

ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.అసలే ఇప్పుడిప్పుడే కరోనా నుండి అందరు కోలుకుంటున్న పరిస్థితులలో మరల సెకండ్ వేవ్ రూపంలో కరోనా వచ్చి ఒక్కసారిగా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న జీవితాలు మళ్ళా వెనక్కి నెట్టబడ్డాయి.

 If That Doesn't Work, It's Very Difficult  The Actress Is Emotional Actress Erik-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల పట్ల నటి ఎరికా  ఫెర్నాండెజ్ ఎమోషనల్ అయింది.ఇంతటి కరోనా పరిస్థితులు ఉన్నా సినిమాలలో నటించడం తప్పలేదని, లేకపోతే ఆకలితో చచ్చే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని అన్నారు.

నేను సినిమాలలో ఉన్నా కాబట్టి నటిస్తున్నా, వేరే ఆఫీసులో పని చేసిన వెళ్లేదానినని నటి ఎరికా  ఫెర్నాండెజ్ అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఇంకా కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలియదు.

ఇప్పటికే ఆరు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను, ఇంకా ఉంటే కుటుంబ పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎప్పటికైనా పనికి వెళ్ళాల్సిందే.ఇక కరోనాకు భయపడే పరిస్థితి లేదని నటి  ఎరికా  ఫెర్నాండెజ్ అభిప్రాయపడింది.

మా లాంటి నటుల అందరి పరిస్థితి ఇలాగే ఉందని, అందరూ కష్టకాలంలో ఉన్నారని, ఇంకా చిన్న నటుల పరిస్తితి చెప్పుకోలేనంతగా ఉందని నటి ఎరికా అభిప్రాయ పడింది.త్వరలో కరోనా కష్ట కాలం ముగిసి సినిమా షూటింగ్స్, సీరియల్ ఆశిస్తున్నానని నటి ఫెర్నాండెజ్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube