పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ... ఏమన్నాడంటే?

సినిమా వాళ్ళు రాజకీయాలలోకి రావడం అన్నది చాలా సహజం.ఎందుకంటే సినిమా వారు జనాలకు సుపరిచితమే కాబట్టి మరల జనాలకు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

 Rgv About  Political Entry, Rgv, Ram Gopal Varma Comments On Political Leaders,-TeluguStop.com

అందుకే సినిమా వారు రాజకీయాలలోకి ప్రవేశించడానికి తహతహ లాడుతుంటారు.అయితే ఎక్కువ మంది సినిమా వాళ్ళు రాజకీయాలలోకి వెళ్లినా ఒక్క ఎన్టీఆర్ తప్ప పెద్దగా ఎవరూ విజయం సాధించిన పరిస్థితి లేదు.

అయితే సినిమా నటులపై రాజకీయాలలోకి రావాలని ఒత్తిడి ఉండటం సహజం.అందరికీ ఉన్నా ఎవరి వ్యక్తిగత నిర్ణయాన్ని బట్టి రాజకీయాలలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.

తరచూ రాజకీయాలపై, రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మను ఓ వ్యక్తి మీరు భవిష్యత్తులో రాజకీయాలలోకి వస్తారా అని అడిగాడు.అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు రాజకీయాలంటే ఇష్టం ఉండదని, నాకు ప్రజలకు సేవ చేయాలని లేదని, నాకు నేనే సేవ చేసుకునే సమయం లేదని, ఇక నేను ప్రజా సేవ ఏం చేస్తానని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.

రాజకీయ నాయకులందరు ప్రజా సేవ పేరుతో రాజకీయాలలోకి వస్తున్నా వారెవరికి ప్రజా సేవ చేయాలని ఉండదని, కేవలం పేరు, పవర్ కోసమే రాజకీయాలలోకి వస్తారని ఆర్జీవీ కుండబద్దలు కొట్టాడు.ఇప్పుడు నెట్టింట్లో ఈ వార్త తెగ వైరల్ గా మారుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube