టీలో దాల్చిన చెక్క క‌లిపి తాగితే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మందికి ఉద‌యం లేవ‌గానే టీ తాగే అల‌వాటు ఉంటుంది.అందుకే అత్య‌ధికంగా సేవించే పానియాల్లో టీ ముందు వ‌ర‌స‌లో నిలిచింది.

 Health Benefits Of Having Tea With Cinnamon! Health, Benefits Of Tea With Cinnam-TeluguStop.com

ప‌రిమితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే టీలో దాల్చిన చెక్క కూడా క‌లిపి తీసుకుంటే.

మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మీరు రెగ్యుల‌ర్‌గా తాగే టీలో చిన్న దాల్చిన చెక్క లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మ‌రిగించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల టీకి మంచి రుచి, వాస‌న రావ‌డంతో పాటు.బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ల‌భిస్తాయి.

ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ క‌రిగించుకోవాల‌ని ప్ర‌య‌త్నించే వారు.ప్ర‌తి రోజు టీలో దాల్చిన చెక్క కూడా క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే.పొట్ట కొవ్వు ఇట్టే క‌రుగుతుంది.

అలాగే నెల‌స‌రి స‌మ‌యంలో దాల్చిన చెక్క వేసి కాచిన టీ తీసుకుంటే.అందులో ఉండే ఫ్లావనాయిడ్స్ మరియు ఇతర యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వ‌ల్ల క‌డుపు నొప్పి, న‌డుము నొప్పి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ప్ర‌స్తుత కాలంలో క‌రోనా వైర‌స్‌ నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకునేందుకు ప్ర‌జ‌లంద‌రూ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Telugu Pain, Belly Fat, Benefitstea, Cinnamon, Cinnamon Tea, Corona, Tips, Immun

అయితే టీలో దాల్చిన చెక్క క‌లిపి తీసుకుంటే.రోగ నిరోధ‌క శ‌క్తి సూప‌ర్‌గా పెరుగుతుంది.దాల్చిన చెక్క వేసిన టీ తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

అంతేకాదు, టీలో దాల్చిన చెక్క కూడా వేసి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెక్కెర స్థాయి అదుపులో ఉంటాయి.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉంటుంది.శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube