క్లిష్ట పరిస్థితుల్లో భారత్: కమలా హారిస్‌‌ను కలిసిన ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, సాయంపై చర్చ

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడిపోతోంది.ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రోజుకు మూడున్నర లక్షల కేసులు, నాలుగువేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

 Indian-american Congressman Meets Kamala Harris Over Covid-19 Crisis In India, J-TeluguStop.com

వైరస్‌పై పోరులో ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర మందుల కొరత భారత్‌ను వేధిస్తోంది.ఈ నేపథ్యంలో ఇండియాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.

ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలు పెద్ద ఎత్తున సాయం చేశాయి.అటు వివిధ దేశాల్లలో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం జన్మభూమిని గట్టెక్కించేందుకు చేతనైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

తొలి నాళ్లలో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతగా మొగ్గుచూపకపోవడంతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లోని ఇండో అమెరికన్ నేతలు, పలువురు ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు.ఆ తర్వాతే బైడెన్ కాస్త మెత్తబడి ప్రధాని మోడీకి ఫోన్ చేసి అండగా వుంటామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా.అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ప్రస్తుతం భారత్‌లోని కరోనా పరిస్ధితులు, అమెరికా చేస్తున్న సాయంపై ఇద్దరు నేతలు చర్చించారు.అనంతరం అమీ బేరా మీడియాతో మాట్లాడుతూ.

భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై కమలా హారిస్‌తో మాట్లాడానని చెప్పారు.అలాగే ఇండియాకు నిధులు, సాంకేతిక నైపుణ్యం, వ్యాక్సిన్ డోసులు సహా అత్యవసర వనరులను పంపినందుకు బైడెన్ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే సమయంలో భారతీయులకు సాయం చేసేందుకు ప్రవాసులను ఏకతాటిపైకి తీసుకురావడంలో హారిస్‌ కృషిని అమీ బేరా కొనియాడారు.భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారితో పోరాడుతున్న దేశాలకు అమెరికా సాయం కొనసాగుతుందని అమీబేరా ఆకాంక్షించారు.

Telugu Amy Bera, Federal, India, Joe Biden, Kamala, Prime Modi-Telugu NRI

కాగా, కోవిడ్‌పై పోరులో భాగంగా భారత్‌కు అమెరికా అదనపు సాయం ప్రకటించింది.ఫెడరల్ ప్రభుత్వం తరపున వంద మిలియన్ డాలర్లు, ప్రైవేట్ రంగం నుంచి అదనంగా మరో 400 మిలియన్ డాలర్ల సాయాన్ని భారత్‌కు పంపుతామని తెలిపింది.ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.అమెరికా నుంచి ఆరు విమానాల ద్వారా 20 వేల కోర్సులు రెమ్‌డిసివర్, 1500 ఆక్సిజన్ సిలిండర్లు, 550 మొబైల్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 10 లక్షల ర్యాపిడ్ కిట్లు, 25 లక్షల ఎన్ 95 మాస్క్‌లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్ సిస్టం, పల్స్ ఆక్సీ మీటర్లు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube