జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలేదు.. మళ్లీ అదే తప్పు: భారత సంతతి యువకుడిపై విమర్శలు

ఏదైనా నేరం చేసిన వారిని జైలుకు పంపేది ఎందుకు.? మళ్లీ నేరం చేయకుండా పూర్తిగా మారేందుకు ప్రభుత్వం ఇలా అవకాశం కల్పిస్తోంది.జైలు నుంచి వచ్చాక మారిన వారు కొందరైతే.కుక్క తోక వంకరలాగా మళ్లీ మళ్లీ నేరాలు చేసి తిరిగి కటకటాల పాలయ్యేవారు ఇంకొందరు.ఈ కోవలోకే వస్తాడు అమెరికాలో భారత సంతతికి చెందిన పరమ్ శర్మ.శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన భారత కుటుంబానికి చెందిన 25 ఏళ్ల శర్మ .కొద్దిరోజుల క్రితం టెస్లా కారులో ఆటోపైలట్ మోడ్‌లో ప్రయాణం చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

 Im Very Rich Indian-american Lands In Jail For Tesla Stunt, Repeats It After Rel-TeluguStop.com

దీనిపై కాలిఫోర్నియా హైవే పెట్రోల్ విభాగం స్పందించింది.

పరమ్ శర్మ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో ఆ కారులో డ్రైవర్ సీట్‌లో ఎవరూ లేరని.

వెనుక మాత్రం శర్మ కూర్చొని అత్యంత రద్దీగా వుండే బే ఏరియా రోడ్‌వేపై ప్రయాణించాడు.అతని కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో శర్మను అదుపులోకి తీసుకుని శాంటా రిటా జైలు‌కు పంపారు.

అతనిపై నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, అధికారి పట్ల దురుసు ప్రవర్తన వంటి రెండు కౌంట్ల నేరాలను నమోదు చేశారు.జైలు నుంచి విడుదలయ్యాక కూడా అతను ఏమాత్రం మారలేదు.

తాజాగా బుధవారం మరోసారి కొత్త టెస్లా కారులో ఆటోపైలట్ మోడ్‌లో మరో స్టంట్ చేశాడు పరమ్ శర్మ.మీరు జైలు నుంచి విడుదలయ్యాక కొత్త టెస్లా కారును కొన్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.

అందుకు అవును, నేను ధనవంతుడిని ’’ అంటూ శర్మ సమాధానం ఇచ్చాడు.కాగా, శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆటో‌పైలట్ మోడ్‌లో ప్రయాణిస్తున్న వీడియోలను తరచుగా షేర్ చేస్తూ ఉంటాడు.

Telugu Autopilot Mode, Caliniahighway, Repeats, Sharma, Texas-Telugu NRI

కాగా, కొద్దిరోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆటోపైల‌ట్ మోడ్‌లో ప్రయాణిస్తున్న టెస్లా కారు చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్ద‌రు వ్యక్తులు మరణించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా, కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో డ్రైవ‌ర్ సీటులో ఎవ‌రూ లేరని తెలిపారు.కారు ఆటోపైల‌ట్ మోడ్‌లో వేగంగా ప్ర‌యాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.కారులో ఉన్న డ్రైవర్‌ సహాయక వ్యవస్థ సరిగ్గా పనిచేయక ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదం నేపథ్యంలో టెస్లా కంపెనీ స్పందించింది.తమ వాహనాలు పూర్తిగా ఆటోపైలట్‌ కాదని, డ్రైవర్‌ పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని తెలిపింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube