ఆ పిల్లల విషయంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం.. !

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా సమయంలో ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించుకుంటే అంతా శూన్యంగానే కనిపిస్తుంది.ఎన్నికల సమయంలో వందల కోట్లు ఖర్చు చేసే పార్టీలు కరోనా సమయం లో ప్రజలను రక్షించడానికి మాత్రం కొసరి కొసరి ఆలోచిస్తాయి.

 Madhya Pradesh Government To Give Five Thousand Pension To Children Who Lost Par-TeluguStop.com

ప్రజలను సోమరులను చేసి, రాష్ట్ర ఖజానాలకు చిల్లులుపెట్టే ఉచిత పధకాలతో పబ్బం గడుపుకుంటు భరించలేని అప్పులను చేసి, ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తూ పీడించుకునే పార్టీలు ఒక్క సారి ఇలాంటి మంచిపనులను ఎందుకు ఆదరించరో ఎంతకు అర్ధం కాదు.

కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అందరు హర్షించే కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

అదేమంటే.కోవిడ్ యుద్ధంలో త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌కులను కోల్పోయిన పిల్ల‌ల‌కు ప్ర‌తి నెల రూ.5 వేలు పెన్ష‌న్ అందిస్తామ‌ని ఈ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌క‌టించారు.అలాగే ఉచిత విద్య‌తో పాటుగా, ఫ్రీగా రేష‌న్‌ను వారి కుటుంబాల‌కు పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ఇప్పటికే జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం కూడా ఇలాంటి ప‌థ‌కాన్నే ప్ర‌క‌టించింది.కాగా ఈ పధకాల వల్ల అనాథలుగా మారిన‌ పిల్ల‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆశించవచ్చూ.అంతే గానీ ఓట్లు రాబట్టుకోవడానికి ఓటర్లను పందికొక్కుల్లా మార్చుకుంటున్న పార్టీల్లో కాస్తైన మార్పు వచ్చి ఇలాంటి మంచిపనులు చేస్తే అడగకుండా, పైసా ఖర్చు చేయకుండా ఓట్లు రాలవా అని కొందరు అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube