ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తుందో మనం చూస్తున్నాం.ప్రస్తుతం దేశంలో మార్మోగుతున్న ఒకే ఒక వ్యక్తి పేరు నటుడు సోనూసూద్.
ఒక్కొక్కరు ఇంతటి క్లిష్ట సమయంలో ఆపన్న హస్తం అందిస్తూ కరోనా బాధితుల పట్ల దేవుడిగా మారాడు.సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు అందరూ ఇప్పుడు సోనూసూద్ వైపు చూస్తున్నారంటే సోనూసూద్ సహాయం చేస్తాడని ఎంతటి నమ్మకంతో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు.
సామాన్యులు ఇబ్బంది పడుతున్నారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి.కాని సెలెబ్రెటీలకు సైతం సామాన్యుల పరిస్థితి ఉంటే ఇంకా చేసేది ఏముంది.
అందుకే సెలెబ్రెటీలు సైతం ప్రభుత్వాలపై, అధికార వ్యవస్థపై నమ్మకం పోయి సోనూసూద్ ను ఆశ్రయించారు.ఇటీవల స్టార్ క్రికెటర్ రైనా తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సీజన్ కావాలని ట్వీట్ చేసాడు.
వెంటనే ఆ ట్వీట్ కు సంబంధించిన సోనూసూద్ 10 నిమిషాలలో సిలిండర్ ఉంటుందని రీట్వీట్ చేసాడు.అయితే తాజాగా హర్భజన్ సింగ్ సైతం ఒక రెమిడిసివిర్ ఇంజక్షన్ కొరకు ట్వీట్ చేయగా తన ఫాలోవర్స్ సోనూసూద్ కి ట్వీట్ చేయమని సూచించారు.
వెంటనే హర్భజన్ ట్వీట్ కు స్పందించిన సోనూసూద్ త్వరలో మీ సమస్య తీరుస్తానని తెలిపారు.ఇక నెటిజన్లు సోనూసూద్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ క్లిష్ట పరిస్థితులలో రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోనూసూద్.