నేచురల్ స్టార్ నాని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
ఏకంగా ఈ మూవీ కోసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు.నిజానికి నాని మార్కెట్ కూడా అంత లేదు.
అయితే కాన్సెప్ట్ డిమాండ్ చేయడంతో అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు రెడీ అయ్యాడు.ఇక సినిమా కోసం ఏకంగా కోటిన్నర పెట్టి కోల్ కత్తా సెట్ ని కూడా వేశారు.
మొన్నటి వరకు ఆ సెట్ లో షూటింగ్ చేశారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఇక ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.అలాగే సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాజాగా సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో కాళికా గెటప్ లో ఆమె లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది.ఈ లుక్ బాగా ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పీరియాడిక్ టచ్ లో ఇస్తూ ప్రెజెంట్ ట్రెండ్ ని కనెక్ట్ చేస్తూ కథ సాగుతుంది.ఇక ప్రెజెంట్ లో జరిగే స్టొరీలో నాని డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తాడని అతని పాటర్ సర్లాక్ హోమ్స్ తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
మొదటి సారి నాని కెరియర్ లో కాస్త డిఫరెంట్ గెటప్ తో ఈ సినిమాలో కనిపిస్తాడని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.