తిరుపతి రుయా ఆస్పత్రి మృతులు 11మంది కాదట.. ఎంతమంది అంటే.. ?

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడ్డారనే వార్త అన్ని సోషల్ మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇది తప్పుడు సమాచారం అని ప్రతిపక్షాలు మొదటి నుండి ఆరోపిస్తున్నాయి.

 Tirupathi Ruia Hospital Deaths Are 31 Not 11, Thirupathi, Ruia Hospital, Dead 31-TeluguStop.com

ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించడానికే నిజాలు దాస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఇది నిజమే అంటున్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు.

వాస్తవానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రి కరోనా మృతులు సంఖ్య 31 అని కానీ ప్రభుత్వం మాత్రం 11 మందే చనిపోయారని ప్రకటించి తమ తప్పును కప్పిపుచ్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు నిమ్మల పేర్కొంటున్నారు.

ఇకపోతే ఈ ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారట.ఏది ఏమైన, నిర్లక్ష్యం ఎవరిదైన మరణించిన కుటుంబాలు మాత్రం అనాధలా మారాయి.

మరి వీరిని ఏ పార్టీ నాయకులు ఆదుకుంటారో అది మాత్రం చెప్పరు.కానీ రాజకీయ లబ్దికోసం రాద్దాంతం చేస్తారని మృతుల బంధువులు అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube