వైరల్ : పడవనే అంబులెన్స్ గా మార్చిన యువకుడు.. ఎక్కడంటే..?

దేశంలో రోజూ 4 లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది.

 Viral: The Young Man Who Turned The Boat Into An Ambulance..where? Carona Virus,-TeluguStop.com

అయితే చాలా మంది ఇతరులకు సాయం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంటున్న ఓ యువకుడు కూడా పరులకు సాయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఈమధ్యే కరోనా బారిన పడి ఆ యువకుడు కరోనా నుంచి కోలుకున్నాడు.అప్పుడు అతనికి కరోనా వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలిశాయి.

ఆ సమయంలో అతను తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది.తన పడవను అంబులెన్సుగా మార్చేసి కరోనా రోగులకు సాయం చేస్తున్న అతని గొప్పతనం చూసి అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తారిక్ అహ్మద్ పట్లూ అనే ఆ యువకుడు తన పడవలో ఇప్పుడు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నాడు.పట్లూకి గతేడాది ఆగస్టులో కరోనా సోకింది.

అప్పటి నుంచి తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనుకున్నాడు.అందుకు తాను తన పడవనే అంబులెన్సుగా మార్చేయాలని అనుకున్నాడు.

అయితే తన పడవను అలా చేయాలంటే కొంత డబ్బు కావాలి.డబ్బులను పోగేసి చివరికి ఏప్రిల్‌లో తన పడవను అంబులెన్స్ గా రెడీ చేశాడు.

ఈ పడవలో పడవలో పీపీఈ కిట్స్ ఉన్నాయి.స్ట్రెచర్స్ ఉన్నాయి.

వీల్ చైర్ కూడా ఉంది.తద్వారా కరోనా పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడం తేలికవుతోంది.

పట్లూకి కరోనా వచ్చినప్పుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.కోలుకున్నాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఎవరూ బోట్ ఎక్కనివ్వలేదు.

ఎక్కడ వారికి కూడా కరోనా వస్తుందేమోననే భయంతో వారు తమ బోట్లలో ఎక్కించుకోలేదు.ఇంత నరకయాతనపడిని ఆ యువకుడు తనలాగా ఇంకెవరికీ అవ్వకూడదనే ఈ అంబులెన్స్ సర్వీసులు తెచ్చాడు.

అతను చేస్తున్న సేవ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న అతన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube