అక్కడ కరోనా టీకా వేయించుకుంటే బీర్ ఫ్రీగా ఇస్తారట....

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగానో కలకలం సృష్టిస్తున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా పలు దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో పారిశ్రామిక రంగంతో పాటు, ఆర్థిక రంగం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.

 Coronavirus Vaccine With Beer Free In America, America News, International News-TeluguStop.com

దీంతో వీలైనంత త్వరగా ఈ కరోనా వైరస్ మహమ్మారి ని తరిమి కొట్టేందుకు వైద్య నిపుణులు టీకాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.అయినప్పటికీ కొంతమేర విఫలమవుతూ వస్తున్నారు.

కానీ ఈ కరోనా వైరస్ ని పూర్తిగా అంతమొందించలేక పోయినప్పటికీ తాత్కాలికంగా మాత్రం ఈ వైరస్ నుంచి ఉపశమనం పొందేందుకు పలు వ్యాక్సిన్లను రూపొందించి ప్రజలకు ఇస్తున్నారు.అయినప్పటికీ కరోనా వైరస్ మాత్రం నియంత్రణలోకి రావడం లేదు.

దీంతో మరోమారు దేశాలన్నీ లాక్ డౌన్ ను ని ప్రకటించాయి.

అయితే తాజాగా అమెరికా దేశం తమ దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టింది.

అయినప్పటికీ కొంతమంది యువకులు మరియు 40 ఏళ్ల పైబడినవారు ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీంతో ఆ దేశ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఉచితంగా బీర్ ని ఇస్తున్నట్లు ప్రకటించింది.

అంతేగాక మే నెల పూర్తయ్యే సరికి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందించాలని ఇప్పటికే పలువురి సంబంధిత అధికారులకు దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

అయితే పక్క దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ చాలా జోరుగా సాగుతున్నపటికీ భారత దేశంలో మాత్రం ఇప్పటికీ కనీసం కోటి మందికి కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందలేదు.

దీంతో రోజురోజుకీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.దీనికితోడు దేశంలో పలుచోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

దీంతో కమ్యూనిస్టులు మరియు పలు సంఘాల నాయకులు మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మోడీ ప్రభుత్వం మొదటగా వ్యాక్సినేషన్ విషయంలో తమ దేశ ప్రజలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర దేశాలకి ఎగుమతి చేసిందని అందువల్లనే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ఎన్ని ప్రకటించాయి.ఇందులో భాగంగా కొన్ని రాష్ట్రాలు 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే ప్రజలకి బయటకి అనుమతిస్తున్నాయి.

ఇతర సమయంలో అనవసరంగా బయటికి వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube