వెంకటేష్ 75వ సినిమా ఖచ్చితంగా ఆయనతోనే అట..?

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు.వెంకటేష్ వరస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కు పోటీగా నిలుస్తున్నాడు.

 Venkatesh 75 Th Movie With Director Trivikram, Trivikram, Venkatesh, 75th Film,-TeluguStop.com

కుర్ర హీరోలు కూడా హిట్ కొట్టడానికి తడబడుతుంటే వెంకీ మామ మాత్రం చెప్పుకో దగ్గ హిట్స్ తో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం వెంకటేష్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.

అందులో ఒకటి ఎఫ్ 3 సినిమా.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.ఇది F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఇప్పుడు ఈ సినిమాను కూడా అనిల్ ఫుల్ ఫన్ తో తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎఫ్ 3 సినిమాను ఆగస్టు 27 వ విడుదల చేయాలనీ భవించినా ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Mehreen, Tamanna, Tollywood, Trivikram, Varun

అయితే వెంకటేష్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇది వెంకటేష్ కెరీర్ లో 75 వ సినిమాగా రాబోతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తోనే ఈ సినిమా చేయాలనీ వెంకటేష్ భావిస్తున్నాడట.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇప్పటికే అధికారికంగా సినిమాను ప్రకటించారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మరొక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ ఖాళీ అయ్యే అవకాశం లేదు.

అందుకే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఈ విషయంపై వీరిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది.75 వ సినిమా కావడంతో వెంకటేష్ ఖచ్చితంగా త్రివిక్రమ్ తోనే చేయాలనీ భావిస్తున్నట్టు టాక్.మరి చూడాలి ఎప్పటి నుండో అనుకుంటున్నా ఈ కాంబినేషన్ ఇప్పటికైనా సెట్ అవుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube