నిద్రించే ముందు ల‌వంగాలు తింటే ఆ జ‌బ్బులు దూరం?

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండే ల‌వంగాలు మసాలా దినుసుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.అందుకే మటన్, చికెన్, ఫిష్‌, బిర్యానీ ఇలాంటివి చేసినప్పుడు వాటిలో ఖ‌చ్చితంగా ల‌వంగాలు పాడాల్సిందే.

 Health Benefits Of Eating Cloves Before Sleeping! Health, Benefits Of Eating Clo-TeluguStop.com

వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని ఇచ్చే ల‌వంగాల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, కాల్షియం, ఫోస్పరాస్, పోటాషియం, సోడియం, మాంగసీస్, ఫైబ‌ర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ల‌వంగాల ద్వారా పొందొచ్చు.

అందుకే ల‌వంగాలు ఆరోగ్యానికి మంచివ‌ని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు ఒక‌టి లేదా రెండు ల‌వంగాలను బాగా న‌మిలి తింటే.ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా నేటి కాలంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.అలాంటి వారు రాత్రి ప‌డుకునే ముందు రెండు ల‌వంగాల‌ను న‌మిలి తినేసి.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు తీసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్యే ఉండ‌దు.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా వేగ‌వంతం అవుతుంది.

అలాగే యుక్త వ‌య‌సు రాగానే ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య మొటిమ‌లు.

అయితే రాత్రి నిద్రించే ముందు ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను తింటే.అందులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు మొటిమ‌ల‌ను రాకుండా అడ్డుకుంటాయి.

గొంతు నొప్పిని త‌గ్గించ‌డంలోనూ ల‌వంగాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.నిద్రించే ముందు ల‌వంగాలు తిని గోరు వెచ్చ‌ని నీరు తీసుకుంటే.

గొంతు నొప్పి ఇట్టే మటుమాయం అవుతుంది.

అంతేకాదు.ల‌వంగాలు జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌రిమి కొట్టి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.సో.రాత్రి నిద్ర‌పోయే ముందు ల‌వంగాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకోండి.అయితే మంచివి క‌దా అని అతిగా తీసుకోరాదు.

కేవలం ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను మాత్ర‌మే తినాలి.

Health Benefits Of Eating Cloves Before Sleeping! Health, Benefits Of Eating Cloves, Sleeping, Eating Cloves, Benefits Of Cloves, Cloves, Health Tips, Good Health, Latest News - Telugu Benefits, Tips, Latest #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube