ఎన్టీఆర్ కరోనా... కొమురం భీమ్ అప్‌ డేట్ పై అనుమానాలు

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.పెద్ద ఎత్తున ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ జరుపుతున్న సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిపి వేశారు.

 Rajamouli Not Interested For Ntr Komuram Bheem Poster From Rrr , Komuram Bheem,-TeluguStop.com

ఈ సినిమా మరో నెలన్నర రోజుల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.కరోనా పరిస్థితి కాస్త కుదుట పడ్డ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్‌ చరణ్ బర్త్‌ డే సందర్బంగా ఇటీవల అల్లూరి సీతారామరాజు గా చరణ్‌ కొత్త పోస్టర్‌ ను విడుదల చేయడం జరిగింది.ఆ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉంది.

ఇక ఈ నెలలో ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా మరో పోస్టర్‌ వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ ఈ సినిమా లో కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే కొమురం భీమ్‌ ఎలా ఉంటాడు అనేది చూపించారు.ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్బంగా మరో పోస్టర్ ను కూడా తీసుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాలని జక్కన్న భావించాడు.

అంతా బాగానే ఉంది పోస్టర్‌ తీసుకు వద్దాం అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.ఈ సమయంలో ఎన్టీఆర్‌ పోస్టర్‌ ను విడుదల చేయడం ఎంత వరకు సబబు అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

గత ఏడాది కూడా కరోనా కారణంగా ఎన్టీఆర్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేయలేదు.ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ పోస్టర్ ను జక్కన్న రెడీ చేయించి ఉంటారు.కనుక విడుదల చేస్తే పోయేది ఏముంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా కరోనా వల్ల కొమురం భీమ్‌ కొత్త పోస్టర్‌ వచ్చేది లేనిది క్లారిటీ రావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube