బాలీవుడ్ లో మరో స్టార్‌ డైరెక్టర్‌ కు ఓకే చెప్పిన ప్రభాస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబిత చాలా పెద్దగా ఉంది.రాధే శ్యామ్‌ సినిమా విడుదల కు సిద్దం అవుతోంది.

 Prabhas Doing One More Bollywood Movie Under Sidhardh Anand Direction , Adipurus-TeluguStop.com

మరో వైపు కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.సలార్‌ టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.మరో వైపు బాలీవుడ్‌ లో ఆదిపురుష్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

విజువల్‌ వండర్‌ గా రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్‌ రూపొందుతుంది.వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నారు.

నాగ్‌ అశ్విన్‌ సినిమా జూన్ లేదా జులై లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇన్ని సినిమాలు ఉండగా మరి కొన్ని సినిమా లను కూడా ఈయన లైన్ లో పెడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సుధ కొంగర దర్శకత్వం లో ఒక సినిమా ను ప్రభాస్ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.కాని బాలీవుడ్ స్టార్‌ దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ తో సినిమా విషయమై మాత్రం కీలక సమాచారం అందుతోంది.దాని ప్రకారం ప్రభాస్ మరియు సిద్దార్థ్‌ ఆనంద్‌ ఒక భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమా ను చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నారు.రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఆ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను కూడా ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా లో ప్రభాస్‌ కు జోడీగా కత్రీనా కైఫ్‌ ను ఎంపిక చేసినట్లుగా కూడా చెబుతున్నారు.హిందీ లో రూపొందించి సినిమా ను సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube