కరోనాకు కొత్త మందు... అమెరికా శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన..!!

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది.ముఖ్యంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న అలజడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.

 Us Research Ivermectin Use Control Covid-19, Covid-19, Ivermectin, Regular Iverm-TeluguStop.com

ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నాయి.ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతూ పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

మరో పక్క అగ్ర రాజ్యం అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు భారత్ లో కరోనా కంట్రోల్ అవ్వాలంటే వ్యాక్సిన్ తో పాటు లాక్ డౌన్ పెడితేనే గాని పరిస్థితులు అదుపులోకి వచ్చేలా లేవని ప్రకటించారు.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం వ్యాక్సిన్ ల ఉత్పత్తులపై దృష్టి పెట్టింది.ఇదిలాఉంటే

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి అమెరికా పరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.తాజాగా అమెరకా పరిశోధకులు కరోనాను అంతం చేయడంలో యాంటీ పారా సైటిక్ అద్భుతంగా పనిచేస్తుందని కనుగొన్నారు.

“ఐవర్మిక్టిన్” ఔషధం కరోనా పై పోరులో చక్కని పని తీరు కనబరుస్తోందని ప్రకటించారు.తరచుగా ఐవర్మిక్టిన్ వాడటం వలన కరోనా మూలాలను సైతం సమూలంగా అంతరించేలా చేయచ్చని తెలిపారు.ఈ విషయాలను అమెరికా జనరల్ ఆఫ్ దేరప్యుటిక్స్ మ్యాగజైన్ లో వెల్లడించింది.

2500 మంది రోగులపై చేసిన ప్రయోగాలలో, ప్రత్యేకంగా నిర్వహించిన ట్రైల్స్ లో ఊహించని ఫలితాలు కనిపించాయని కోవిడ్ క్రిటికల్ కేర్ అలయన్స్ ప్రెసిడెంట్ పియరె కోరి తెలిపారు.ఐవర్మిక్టిన్ తీసుకున్న వారిలో మరణాల శాతం చాలా తక్కువగా కనపడిందని ఈ మందును రోజు వాడటం ద్వారా కరోనా లక్షణాలు తగ్గుతూ ఉండటం తాము గమనించామని తెలిపారు.కరోనాను నియంత్రించడంలో ఐవర్మిక్టిన్ పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదని, ప్రపంచ దేశాలన్నీ ఐవర్మిక్టిన్ ను రోగులకు వాడేలా చర్యలు చేపట్టలాని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube