పిలిచి అవకాశం ఇచ్చారు. చెప్పకుండా తొలగించారు.. ఇదెక్కడి అన్యాయం జగనన్నా.. ?

ఏపీ సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న విజయవాడకు చెందిన దేవిని అకస్మాత్తుగా ఆ స్దానం నుండి తొలగించిన విషయం తెలిసిందే.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఉన్నపళంగా తనను తొలగించడం పై దాడి దేవి తీవ్ర ఆవేదన చెందుతున్నారట.
ఇక తన పై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవికి ఊహించని విధంగా ఎదురుదెబ్బ తాకడంతో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.అంతే కాకుండా ఇదెక్కడి అన్యాయం జగనన్నా? అంటూ వైసీపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి తన భర్త పార్టీ కోసం పనిచేస్తున్నారని గుర్తుచేశారు.అయినా గానీ ఇప్పటి వరకు ఎలాంటి పదవులను తాము ఆశించలేదని, ఇక పిలిచి మరీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించారని, కానీ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు దేవి.

 Former Member Of Simhachalam Temple Questions Ys Jagan, Simhachala Temple Trust-TeluguStop.com

ఇకపోతే దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా దాడి దేవి స్థానంలో, భాగ్యలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది.

ఈ సందర్భంగా జీవో అమలును 8 వారాలపాటు నిలిపివేసిన ధర్మాసనం అప్పటి వరకు దేవినే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube