వండర్ విమెన్ కి దర్శకుడు నుంచి వేధింపులు

హాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.చాలా మంది స్టార్ హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చి తమని వేధించిన దర్శకులు, నటులకి సంబందించిన భాగోతాలని బయట పెట్టారు.

 Gal Gadot Faces Waves Of Racist Harassment From Director Joss Whedon, Hollywood,-TeluguStop.com

ఈ మీటూ ఉద్యమం కారణంగా కొంత మంది నటులు జైలు పాలయ్యారు కూడా.అంతర్జాతీయంగా సెన్సేషన్ అయిన హాలీవుడ్ మీటూ ఉద్యమం స్ఫూర్తితో బాలీవుడ్ లో కూడా చాలా మంది నటీమణులు తమకు ఇండస్ట్రీలో ఎదురైనా లైంగిక వేధింపుల గురించి బయట పెట్టారు.

ప్రముఖ నటులపైన కూడా వేధింపుల ఆరోపణలు వచ్చాయి.కొంత మంది దర్శకుల కెరియర్ కూడా నాశనం అయ్యింది.

అయితే ఈ మీటూ ఉద్యమాన్ని కొంత మంది మహిళలు తమ వ్యక్తిగత స్వార్ధం కోసం కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు.సౌత్ లో కూడా మీటూ ఉద్యమం మాటున లైంగిక వేధింపులపై చాలా మంది గళం ఎత్తారు.

అయితే కొంత మంది వ్యక్తిగత లబ్ది కోసం మీటూని ఉపయోగించుకోవడంతో అది కాస్తా నీరుగారిపోయింది.తాగా మరోసారి హాలీవుడ్ లో వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి.వండర్ విమెన్ సినిమాలో టైటిల్ రోల్ పోషించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాళ్ గాడెట్ కి దర్శకుడు నుంచి వేధింపులు ఎదురవుతున్నట్లు పేర్కొంది.సూపర్ హీరో చిత్రాల స్పెషలిస్ట్ జస్టిస్ లీగ్ దర్శకుడు జాస్ వెడన్ ఈ వేధింపులకి పాల్పడుతున్నట్లు ఆమె పేర్కొంది.

జస్టిస్ లీగ్ లో గాడెట్ తన పాత్ర విషయంలో అసంతృప్తిగా ఉందిట.వండర్ ఉమెన్ కంటే ఇందులో పాత్ర మరింత అగ్రెస్సివ్ గా ఉందని.

తన పాత్ర ప్లోలో ఉండాలనే దర్శకుడికి సూచించడంతో జాస్ కి కోపం వచ్చిందిట.అప్పటి నుంచి గాడెట్ కు సమస్యలు మొదలైనట్లు తెలిపింది.

అసభ్యంగా ప్రవర్తించడం.మాటలతో వేధించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిపింది.

మాట వినకపోతే గాడోట్ కెరీర్ ని నానం చేస్తాడని హెచ్చరించాడట.జాస్ తో తన పాత్ర గురించి అలా మాట్లాడటమే సమస్యలు తెచ్చిపెడుతున్నాయని అవేదన వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube