మిగితా ఐపీఎల్ - 2021 భారత్‌ లో ఉండబోదంటున్న దాదా..!

కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ఐపీఎల్ 2021 నిర్విరామ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే మళ్లీ ఈ ఐపీఎల్ సీజన్ పునరుద్ధరించి కొనసాగిస్తారో లేదా అన్న విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు.

 The Rest Of The Ipl - 2021 Is Going To Be In India Ipl, Ipl  2021, India, Soura-TeluguStop.com

ఇందులో భాగంగానే మిగిలిన ఐపీఎల్ 14 సీజన్ ను భారత్లో నిర్వహించే అవకాశం లేదని సౌరవ్ గంగూలీ తేల్చేశారు.ఒకవేళ మళ్లీ ఐపీఎల్ మొదలుపెట్టినట్లు అయితే జట్టు అన్నిటికీ కూడా మరో 14 రోజుల పాటు క్వారంటైన్ సమయం విధించి దాని కోసం అన్ని ఏర్పాట్లు చేయడం కష్టమని తెలియజేశారు.

ఐపీఎల్ నిర్వహించడానికి ప్రపంచ దేశాల్లోని మిగతా బోర్డులను కూడా సంప్రదించాక ప్రస్తుతం అర్ధంతరంగా ఆగిపోయిన 14వ సీజన్ జరపాలా ? వద్దా ? అన్న విషయం పై ఆలోచిస్తామని ఆయన తెలియజేశారు.ఐపీఎల్ 14 సీజన్ సగం మ్యాచ్ లు ముంబై, చెన్నై నగరాల్లో వేదికగా బాగానే జరిగిన ఆ తర్వాత మిగతా మ్యాచులు అహ్మదాబాద్, ఢిల్లీ నగరాలలో జరపాలని ప్రయత్నించారు.

అప్పుడే ఐపీఎల్లో ఉన్న బయో బబుల్ బలహీన పడిందని ఆయన తెలియజేశారు.ఇందులో భాగంగానే జట్ల ఆటగాళ్లకు కరోనా సాగుతుందని ఆయన అభిప్రాయాలు తెలియజేశారు.ఇందులో భాగంగానే ఐపిఎల్ లోని వివిధ జట్ల ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రా, మైక్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీ లాంటివారికి కరోనా సోకడంతో పూర్తి సీజన్ ని నిలిపి వేయక తప్పలేదు.

Telugu Carona Effect, India, Ipl, Ups-Latest News - Telugu

ఇకపోతే తర్వాత మిగిలిన సీజన్ ను ఎప్పుడు నిర్వహిస్తామని ఇప్పుడే చెప్పడం సాధ్యపడదని తగిన విండో కోసం ప్రయత్నించాలి అంటూ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.ఇందులో భాగంగానే ప్రస్తుతం మిగిలిన సీజన్ కు ఆదిత్యం ఇచ్చేందుకు బీసీసీఐని ఇప్పటికే చాలా దేశాలు అలాగే వివిధ క్రికెట్ సంఘాలు తాము నిర్వహిస్తామని ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీలంక, యూఏఈ, సర్రే, వార్ విక్ షైర్, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లాంటి వాటినుండి బిసిసిఐకి ప్రతిపాదనలు వచ్చాయి.

వీటి ప్రతిపాదనలను ఆలోచించి సరైన బోర్డును ఆశ్రయించే ప్రయత్నంలో బీసీసీఐ అడుగులు వేస్తోందని అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube