లీక్ అయిన 'బంగార్రాజు' స్టోరీ లైన్ ?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.కుర్ర హీరోలే హిట్స్ కొట్టడానికి నానాపాట్లు పడుతుంటే ఈయన మాత్రం మంచి హిట్స్ అందుకుని దూసుకు పోతున్నాడు.

 Akkineni Nagarjuna Bangarraju Movie Latest Interesting Updates, Nagarjuna, Naga-TeluguStop.com

ఈ మధ్యనే ఆశిషోర్ సోలమన్ డైరెక్షన్ లో ఆయన నటించిన ‘వైల్డ్ డాగ్‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.

హిట్ అందుకోవడంతో అదే జోష్ లో నాగార్జున మరొక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.ఈ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు అదిరిపోయే స్పందన వచ్చింది.

ఇప్పుడు అదే పేరుతొ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Telugu Akhil Akkineni, Akkineni, Bangarraju, Bangarrajustory, Kalyan Krishna, Na

తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో నాగ చైతన్య కూడా మరొక హీరోగా నటిస్తున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.కానీ నాగ చైతన్య గెస్ట్ రోల్ లో మాత్రమే కనపడబోతున్నాడని ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న టాక్.నాగ చైతన్య కొడుకు పాత్రలో అఖిల్ నటించబోతున్నాడని సమాచారం.

బంగార్రాజు కథ మొత్తం తాత, మనవడు అఖిల్ చుట్టూ తిరుగుతుందని లేటెస్ట్ గా వస్తున్న టాక్.నాగార్జున, అఖిల్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుందని ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తుంది.

మరి చూడాలి ఈ వార్తలో నిజమెంతో.ఈ సినిమాను జులై లో సెట్స్ మీదకు తీసుకెళ్ళ బోతున్నారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube