తన మొదటి సినిమా అందరిని మెప్పించే విధంగా ఉంటుందంటున్న అభిరామ్ దగ్గుబాటి

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దగ్గుబాటి రానా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

 Abhiram Daggubati Open Up On His Entry Movie, Tollywood, Telugu Cinema, Director-TeluguStop.com

తేజ దర్శకత్వంలో అభిరామ్ మొదటి సినిమా ఉంటుంది.ఇప్పటికే చిత్రం 1.1 టైటిల్ తో తేజ తన నెక్స్ట్ సినిమాని ఎనౌన్స్ చేశాడు.దర్శకుడుగా తాను కెరియర్ స్టార్ట్ చేసిన చిత్రం మూవీకి సీక్వెల్ గా దీనిని స్టార్ట్ చేశాడు.

ప్రెజెంట్ నేటివిటీకి తగ్గట్లు యూత్ మైండ్ సెట్ ని ఈ సినిమాలో తేజ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక చిత్రం మూవీకి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ అంతా మళ్ళీ ఈ మూవీ కోసం కలిసారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇప్పటికే నటుడుగా అతను అన్ని మెలుకువలు నేర్చుకున్నాడు.

దీంతో ఎప్పటి నుంచో తెరంగేట్రం కోసం వేచి చూస్తున్నాడు.ఇక హీరోగా తన ఎంట్రీ గురించి అభిరామ్ మీడియాతో ముచ్చటించాడు.

తన తాతగారితో కలిసి షూటింగ్ లకి వెళ్ళడంతో మొదటి నుంచి సినిమా వాతావరణంలోనే ఉన్నానని, తన మొదటి సినిమా తేజ దర్శకత్వంలోనే చేయాలని ఆయన కలిసిన ప్రతిసారి చెప్పేవాడిని అని చెప్పాడు.అనుకున్నట్లుగానే అయన దర్శకత్వంలో లాంచ్ అవ్వడం సంతోషంగా ఉందని అన్నాడు.

ఇక తన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, బలమైన ఎమోషన్స్ కథలో భాగంగా ఉంటాయని చెప్పాడు.కరోనా సెకండ్ వేవ్ సాధారణ స్థితికి రాగానే తన సినిమా స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube