ఆన్‌లైన్‌లో మద్యం.. నిర్ణయించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. !

మద్యం కు అలవాటైన వారికి ప్రాణాలు పోతున్నా సరే నోటిలో చుక్క పడందే వారి ఆత్మ శాంతించదు.ఈ మద్యం మత్తెక్కించే కిలాడి ఒక్కో చుక్కతో తెలియని ప్రపంచాన్ని పరిచయం చేసే మత్తైన వగలాడి.

 Liquor Online Decided By The Chhattisgarh Government Lockdown, Coronavirus, Coro-TeluguStop.com

అందుకే తినడానికి తిండి లేకున్నా మందు బాబులకు మాత్రం మద్యం ఉంటే చాలు.కానీ కరోనా వల్ల ఈ వైరస్ సోకిన పేషెంట్లకంటే ఎక్కువగా మద్యానికి బానిసలైన వారు బాధపడుతున్నారట.

మందు దొరక్క, దొరికిన దానిని మద్యంగా భావించి తీసుకోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారట.అయితే ఇలాంటి వారికోసం ఛత్తీస్‌గర్ ప్రభుత్వం మత్తెక్కించే వార్త చెప్పింది.ఆన్‌లైన్ వేదికగా మద్యం సరఫరా చేస్తామని ప్రకటించింది ఇక లాక్‌డౌన్ వల్ల ఇక్కడ మద్యం షాపులన్నీ మూతపడ్డాయి.దాంతో ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌ద్యం అక్రమ సరఫరా చేస్తున్నారు.

అందుకే వీటికి చెక్ పెట్టేందుకుగాను ఆన్‌లైన్‌లో మద్యం అమ్మాలని ఛత్తీస్‌గర్ ప్రభుత్వం నిర్ణయించిందట.ఇకపోతే మద్యం ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం రేపటి నుండే అమలు చేస్తుందట.

అయితే మద్యం హోం డెలివరీ కోసం తమ ఫోన్‌లో CSMCL అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా వివరాలు నమోదు చేస్తే సరిపోతుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube