మీ పిల్ల‌లు బ‌రువు పెర‌గ‌డం లేదా..అయితే ఇవి పెట్టాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రు పిల్ల‌లు ఎత్తు పెరుగుతారు.కానీ, బ‌రువు పెర‌గ‌రు.

 What Foods Should Children Be Given To Gain Weight?!  Good Food,  Children, Gai-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర లేమి, పోష‌కాల లోపం, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బరువు పెర‌గ‌కుండా ఉంటారు.దాంతో త‌ల్లిదండ్రులు భయాందోళనకు గురవుతూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క పిల్ల‌ల‌ను హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిప్పుతుంటారు.కానీ, ఎలాంటి భ‌యం చెంద‌కుండా.

పిల్ల‌ల డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాలను చేర్చితే చ‌క్క‌గా బ‌రువు పెరుగుతారు.మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్ల‌లు బ‌రువు పెరిగేలా చేయ‌డంలో అర‌టి పండు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. హై క్యాలరీ ఫుడ్ అయిన‌ అరటి పండును ప్ర‌తి రోజు పిల్ల‌ల చేత ఒక‌టి చ‌ప్పున తినిపిస్తే ఖ‌చ్చితంగా వారు పెరుగుతారు.

Telugu Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్ టి

అలాగే పిల్ల‌లు ఆరోగ్య కరంగా బరువు పెరగడానికి న‌ట్స్ మంచి అప్ష‌న్‌.బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు, కిస్ మిస్‌, పిస్తా ప‌ప్పు, వాల్ న‌ట్స్ వంటివి డైలీ పిల్ల‌ల‌కు ఇస్తే వాటిలో ఉండే న్యూట్రియెంట్స్ వెయిట్ గెయిన్ అయ్యేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.న‌ట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో ర‌క్త హీన‌త స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.

మీ పిల్ల‌లు బ‌రువు పెర‌గాలంటే ఖ‌చ్చితంగా వారి డైలీ డైట్‌లో పాలు, పెరుగు, నెయ్యి ఉండేలా చూసుకోవాలి.

వీటి ద్వారా పిల్ల‌ల‌కు బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు స‌రైన బ‌రువు పెరుగుతారు.

హెల్దీ క్యాలరీలు అందించి బ‌రువు పెరిగేలా చేయ‌డంలో బెల్లం కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందువ‌ల్ల‌, మీ పిల్ల‌ల‌కు బెల్లంతో చేసి వంట‌ల‌ను పెడితే మంచిది.ఇక వీటితో పాటు ఓట్స్‌, ఎగ్స్‌, చికెన్‌, ఫిష్‌, ప్యాన్ కేక్స్, చిలగడదుంప, బంగాళాదుంప, అవకాడో, ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి కూడా పెడితే మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube