తీవ్ర నిరాశలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు... భవిష్యత్ మీద ఆశ లేకనేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉంది.అసలు ఏ మాత్రం రాష్ట్రంలో ఎదిగే పరిస్థితి కనిపించడం లేదు.

 Telangana Congress Leaders In Deep Despair Is There No Hope For The Future, Tel-TeluguStop.com

అయితే ఇప్పటికే జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం సత్తా చాటని పరిస్థితి ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు కొని నిర్వహించిన గ్రేటర్ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఇలా అన్ని రకాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది.

నేతల మధ్య ఆధిపత్య పోరుతో నలిగిపోతున్న కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కూడా అంతా ఒక్కటై పోరాడే తత్వం లేకపోవడమే కాంగ్రెస్ ఓటములకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాక ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడకపోవడంతో క్షేత్ర స్థాయిలో సైతం ప్రజలకు అండగా కాంగ్రెస్ నిలవలేకపోయింది.

అందుకే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని భావించి గెలిపిస్తున్నారు.ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు పార్టీ పటిష్టతకు కృషి చేయకపోవడంతో ప్రజలు కూడా కాంగ్రెస్ ను అందరించడం లేదు.

అందుకే కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు.అందుకే ఇక కాంగ్రెస్ ఇతర పార్టీలలోకి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.కాంగ్రెస్ నేత రాములు నాయక్ కాంగ్రెస్ ను త్వరలో వీడనున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికిప్పుడు దానిపై క్లారిటీ రాకున్నా కొద్ది రోజుల్లో ఏ పార్టీలో చేరానున్నాడనే విషయం తేలనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube