పెళ్లికూతురులా తయారైన బిగ్ బాస్ అరియానా.. కారణమిదేనా..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియానా గ్లోరీకి బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలో చాలామంది కంటెస్టెంట్లు పాల్గొన్నప్పటికీ ఆ షో తరువాత హీరోయిన్ ఆఫర్లు అందుకున్న కంటెస్టెంట్ అరియానా మాత్రమేనని చెప్పాలి.

 Ariyana  Bridal  Getup Photos Goes Viral In Social Media, Ariyana , Bridal Getup-TeluguStop.com

బిగ్ బాస్ తరువాత కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేసి వార్తల్లో నిలిచిన అరియానా గత కొంతకాలంగా ఆ షోకు దూరంగా ఉన్నారు.

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో అరియానా గ్లోరీ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమా అవకాశాలతో పాటు మాల్స్ ఓపెనింగ్ ఆఫర్లు కూడా అరియానాకు వస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే తాజాగా అరియనా పెళ్లికూతురు గెటప్ లో ముస్తాబయ్యారు.అరియానా పెళ్లికూతురు గెటప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ షోలో, బిగ్ బాస్ షో తరువాత అరియానా గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించారు.

Telugu @anchorariyana, Ariyana, Bridal Getup-Movie

అయితే అరియానా పట్టుచీర కట్టుకొని కొత్త లుక్ లో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.త్వరలో అరియానా పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.మెరిసే ఆభరణాలను వేసుకుంటూ అందంగా కనిపిస్తున్నారు.తన పెళ్లి చేసుకోబోయే వాళ్లు ఎక్కడున్నారో ? అంటూ అరియానా పోస్టులు పెట్టగా అరియానాను పెళ్లెప్పుడు చేసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.–

ఈ మధ్య కాలంలో అరియానా పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ పెళ్లి వార్తల గురించి అరియానా మాత్రం స్పందించి స్పష్టతనివ్వలేదు.హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అరియానా ఇప్పుడే పెళ్లి చేసుకుంటారో లేక ఆఫర్లు తగ్గిన తరువాత పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది.

అరియానాకు మరికొన్ని సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube