ఎన్టీఆర్ మాటతో పిచ్చెక్కింది.. రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు..?

వందల సంఖ్యలో సినిమాల్లో నటించి సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రతిభ ఉన్న ఎంతోమంది నటులకు అవకాశాలు ఇవ్వడంతో పాటు వాళ్లు ఎదగడానికి ఎంతోమంది సహాయం చేశారు.

 Senior Ntr Questions Rajendra Prasad After Receiving Gold Medal , Senior Ntr, Ra-TeluguStop.com

నట కిరీటి రాజేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు జరిగిన ఘటనల గురించి చెప్పుకొస్తూ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కామెడీ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకొని ఇప్పటికీ అవకాశాలను సంపాదించుకుంటూ తన నటనతో మెప్పిస్తున్న రాజేంద్ర ప్రసాద్ కు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయం ఉంది.

రాజేంద్రప్రసాద్ ది కూడా ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరు కావడం గమనార్హం.ఇంజనీరింగ్ చదివిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ నటుడు కావాలనే ఆలోచనతో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ ను సంపాదించుకున్నారు.

గోల్డ్ మెడల్ వచ్చిన తరువాత సీనియర్ ఎన్టీఆర్ ను కలవగా తనకు నటనపై సీరియస్ నెస్ ఉందని సీనియర్ ఎన్టీఆర్ కు అర్థమైందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

Telugu Charlie Chaplin, Institute, Gold Medal, Nimmakuru, Rajendra Prasad, Rajen

అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలకు ఒక్కో హీరో ఉన్నారని మరి నీ ప్రత్యేకత ఏమిటని అడిగారని ఆ ప్రశ్నకు తనకు పిచ్చెక్కిపోయిందని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.ఎన్టీఆర్ తన నెత్తిపై ఆ మాటతో గుదిబండ వేశారని తెలిపారు.

ఆ తరువాత తాను స్నేహితులతో కలిసి ఛార్లీ ఛాప్లిన్ సినిమా వారోత్సవాలకు హాజరయ్యానని అక్కడ ఛార్లీఛాప్లిన్ సినిమాలన్నీ చూశానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఆ తర్వాత తాను కామెడీ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుని ఆ సినిమాలే చేశానని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.కామెడీ సినిమాలు చేసి తాను పైకొచ్చానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన గాలిసంపత్ సినిమా రాజేంద్రప్రసాద్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube