గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​ లో స్థానం సంపాదించిన చిలకలూరిపేట చిన్నారి..!

పిట్ట కొంచెం.కూత ఘనం.

 Fazila A Girl From Chilakaluripeta Gets Guinness Book World Record By Fastest Ar-TeluguStop.com

అని కొంతమంది పిల్లల్ని చూస్తే ఇట్లే అర్థమవుతుంది.తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిది సంవత్సరాల చిన్నారి ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును ఎక్కించుకుంది.

హేమాహేమీలు ఎంతో కష్టపడి సాధించే ఈ రికార్డును ఈ చిన్నారి తన పేరును లిఖించుకుంది.రసాయన శాస్త్రం లోని ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఈ రికార్డును సొంతం చేసుకుంది.

రసాయన శాస్త్రంలో ఉన్న మూలకాల ఆవర్తన పట్టికలో అతి తక్కువ సమయంలో మూలకాలను ఒక వరుస క్రమంలో చేయడంతో ఈ తొమ్మిది సంవత్సరాల చిన్నారి రికార్డును సొంతం చేసుకుంది.ఈ రికార్డును ఫజిల కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో మూలకాలను ఓ వరుస క్రమంలో అమర్చి రికార్డును సొంతం చేసుకుంది.

ఇదివరకు ఈ రికార్డు రెండు నిమిషాల 29 సెకన్లకు పాకిస్తాన్ బాలిక రికార్డును సొంతం చేసుకొని ఉండగా తాజాగా ఆ రికార్డును ఫజిల తిరగరాసింది.

ఇక ఫజిల కుటుంబం విషయానికి వస్తే.

Telugu Periodic, Fazila, Chilakaluripeta, Guinness, Gunnis, Guntur, Latest-Lates

అమ్మాయి తండ్రి రహీం ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా తల్లి గృహిణిగా ఉంది.తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో తండ్రికి తెలిసిన విషయాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండటంతో.ఆ చిన్నారికి రసాయన శాస్త్రం పై ఆసక్తి కనబరచడంతో తన తండ్రి సహకారంతో వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube