న్యూస్ రౌండప్ టాప్ 20

1.కర్ణాటకలో రెండువారాల లాక్ డౌన్

 కరోనా కారణంగా కర్ణాటక రాష్ట్రం రెండు వారాల లాక్ డౌన్ ప్రకటించింది.మే 10 ఉదయం 6 గంటల నుంచి మే 24 ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.ఏపీలో కరోనా

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 17, 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.  చోటా రాజన్ బతికే ఉన్నాడు : ఎయిమ్స్

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ బతికే ఉన్నాడని ఎయిమ్స్ ప్రకటించింది.ఆయన చనిపోయాడు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎయిమ్స్ స్పందించింది.

4.తమిళనాడులో పూర్తిస్థాయి లాక్ డౌన్

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

గత కొంతకాలంగా తమిళనాడులో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, 14 రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.మే 10 నుంచి 24వ తేదీ వరకు ఈ సంపూర్ణ రాష్ట్రం అమలులో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

5.11,12 తేదీలలో పెరగనున్న ఎండ తీవ్రత

సముద్రతీర జిల్లాలో ఈనెల 11, 12 తేదీల్లో ఎండ తీవ్రత పెరగనున్నట్టు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది.

6.పుట్ట మధు అరెస్ట్

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

పెద్ద పల్లి జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ నేత పుట్ట మధు ఎట్టకేలకు అరెస్టయ్యారు.మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టమధు పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

7.మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు కు నో ఎంట్రీ

కరోనా మహమ్మారి తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను ఇక మీదట అనుమతించకూడదని  నిర్ణయించుకున్నారు.

8.నేడు రేపు హైదరాబాద్ లో ఉద్యోగ మేళా

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

లైమన్ కన్సల్టెంట్ సంస్థ  ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల జాబ్ మేళా ను ఈ నెల 8 ,9 తేదీలలో ఎల్బీ నగర్ లోని సితార హోటల్ వెనుక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఖాసిం ఖాన్ తెలిపారు.

9.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు వాయిదా

కోవిడ్ రెండోదశ తీవ్రత నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

10.టి సేవా కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

తెలంగాణ వ్యాప్తంగా టి సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టి సేవా కేంద్రం డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.పూర్తి వివరాలకు 8179955744 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

11.‘ఫ్రీడమ్ ఆయిల్ ‘ ఐసోలేషన్ కేంద్రం

కరుణ స్వల్ప లక్షణాలు ఉన్న వారికోసం ఉప్పల్ సమీపంలోని ఆర్ వి కె పాఠశాల వద్ద ఫ్రీడమ్ ఆయిల్ సంస్థ 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

12.రెడ్డీస్ ల్యాబ్స్ లో రెమ్ డేసివర్ తయారీ

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

కరుణ విజృంభిస్తున్న నేపథ్యంలో రెమ్ డేసివర్ ఇంజెక్షన్ల తయారీకి డాక్టర్ రెడ్డిస్ లాబ్స్ కు అనుమతులు ఇస్తున్నట్లు విసేజ్ జోన్  డెవలప్మెంట్ కమిషనర్ ఎం రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

13.నీట్ విద్యార్థులకు ఉచితంగా షార్ట్ నోట్స్

నీట్ యూజీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా షార్ట్ నోట్స్ ఇవ్వనున్నట్లు ఐఐటీ జేఈఈ ఫోరం డైరెక్టర్ లలిత్ కుమార్ తెలిపారు.

14.డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్లు ఔషధాలను డ్రోన్ ద్వారా అందించేందుకు ఉద్దేశించిన ‘ మెడిసిన్ ఫ్రం ద స్కై ‘ ప్రాజెక్టు తెలంగాణలో త్వరలో అమల్లోకి రానుంది.దీనికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది.

15.కరోనా రెండో దశ వ్యాప్తి పై నేడు వీడియో కాన్ఫరెన్స్

కరోనా రెండో దశ వ్యాప్తిపై నేడు వీడియో కాన్ఫరెన్స్ ను అధికారులు ఉదయం 11 గంటలకు తెలంగాణ నైపుణ్య విజ్ఞాన సంస్థ సదస్సు నిర్వహించనుంది.

16.నేడు ఏపీలో టీడీపీ నిరసనలు

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.‘ వాక్సిన్ సరఫరా చేయండి.ప్రాణాలు కాపాడండి’ అనే నినాదంతో నిరసన చేయనుంది.

17.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  శుక్రవారం ఆరు వేల లోపు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

18.ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు రద్దు

ఆర్టిసి అంతర్రాష్ట్ర సర్వీసులు పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది.

19.శంషాబాద్ లో 30 విమాన సర్వీసులు రద్దు

Telugu Rajivgandhi, Shamshabad, Gold, Top, Vaccine-Latest News English

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,900

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,900.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube