ఆ అనసూయ సినిమాని అన్ని కోట్లు పెట్టి కొన్నారట... కానీ...

తెలుగులో ఇటీవలే ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ మరియు యంగ్ హీరో విరాజ్ అశ్విన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన “థాంక్యూ బ్రదర్” అనే చిత్రం ఇటీవలే ఓటిటిలో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత లు శరత్ చంద్ర రెడ్డి మరియు బొమ్మిరెడ్డి తదితరులు సంయుక్తంగా నిర్మించారు.

 Anchor Anasuya Thank You Brother Movie Public Talk, Telugu Anchor,  Anasuya, Tha-TeluguStop.com

అయితే ఈ చిత్రాన్ని మొదటగా సినిమా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఈ రోజున ప్రముఖ ఓటీటీ అయిన “ఆహ” లో విడుదల చేశారు.

అయితే ఈ చిత్రంలో యాంకర్ అనసూయ నటన పర్వాలేదనిపించడంతో కొంతమేర ఈ చిత్రానికి ప్లస్ అయింది.

కానీ ఇతర సాంకేతిక వర్గం మరియు నటీనటులను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాడు.దాంతో కథను పెద్దగా రక్తి కట్టించ లేకపోయాడు.అంతేగాక కథలో కొంతమేర సాగదీసే సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది.కానీ క్లైమాక్స్ 30 నిమిషాల నిడివి మాత్రం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది.

దాంతో దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని కొంత మేర సాగదీస్తూ చెప్పాడు.అయితే దర్శకుడు చేసిన ప్రయత్నం మంచిదే అయినప్పటికీ కానీ ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రం కోసం ఆహా ఆహా టీమ్ దాదాపుగా “రెండు కోట్ల రూపాయల” వరకు చిత్ర యూనిట్ సభ్యులకి చెల్లించినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్ర టాక్ ఎలా ఉన్నప్పటికీ యాంకర్ అనసూయ మాత్రం తన కెరీర్లో మరో మంచి చిత్రమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ప్రస్తుతం యాంకర్ అనసూయ తెలుగులో వరుస చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube