తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే.. ?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణలో లాక్‌డౌన్ ఉండబోదని, కానీ కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

 Telangana Govt Extends Night Curfew In State, Corona Cases, Telangana Govt, Exte-TeluguStop.com

ఇకపోతే తెలంగాణలో ఏప్రిల్ 20వ తారీఖు నుండి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ కర్ఫ్యూ ఈ నెల 15 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతే కాకుండా కోవిడ్ నిబంధలను కొన్నీంటిని కూడా విడుదల చేసింది.ఆ మార్గదర్శకాలు పరిశీలిస్తే.

రాష్ట్రంలో జరిగే వివాహ వేడుకలకు 100 మందికి మించి హాజరుకారాదని, అలాగే అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొంది.ఇక సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే హైకోర్టు నైట్ కర్ఫ్యూతో ప్రయోజనం ఏంటని.వీకెండ్ లాక్ డౌన్ కూడా పరిశీలించాలని ఆదేశించినప్పటికీ.

ప్రభుత్వం మాత్రం నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube