మరో 20 ఏళ్ళ పాటు ఏడాదికొకసారి కరోనా లాక్ డౌన్ తప్పదా...?

ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ కరోనా వైరస్ మహమ్మారి ఒక్కసారిగా మానవ ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులలోకి నెట్టేసింది.దీంతో ఇప్పటికే చిన్నాచితకా వ్యాపారులు ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

 Coronavirus Effect Till 20 Years, Corona Virus, Lock Down, India, Corona Virus E-TeluguStop.com

ఇక కూలినాలి చేసుకొని కుటుంబాలని నెట్టుకొస్తున్న రోజువారి కూలీలు తిండి లేక పస్తులు గడుపుతున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పారిశ్రామిక రంగంతో పాటు ఆర్థిక రంగం కూడా తీవ్రంగానే దెబ్బతింది.

దీంతో ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియని మొదలు పెట్టినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.దాంతో మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

అయితే పూర్వం దేశంలో ప్లేగు వ్యాధి విజృంభించిన సమయంలో కూడా ప్రజలు లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.ఆ తరువాత మెల్లమెల్లగా ఈ వ్యాధి తీవ్రత తగ్గినప్పటికీ ప్లేగు వ్యాధి ఛాయలు మాత్రం దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల పాటు కనిపించాయి.

ఆ తర్వాత వైద్యులు పురోగతి సాధించి ప్లేగు వ్యాధిని నివారించేందుకు టీకాలను కనుగొనడంతో ప్రస్తుతం దాదాపుగా ఈ ప్లేగు వ్యాధిని అరికట్టారు.అలాగే జన్యు పరంగా ఏదైనా ఓ వైరస్ లేదా వ్యాధి సోకినట్లయితే వాటి యొక్క ప్రభావం దాదాపుగా రెండు లేదా మూడు తరాల వరకు ఉంటుందని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఇప్పటికిప్పుడు కరోనా వైరస్ ని పూర్తిగా అంతమొందించి టీకాలను కనుగొన్నప్పటికీ ఈ వైరస్ యొక్క ప్రభావం మాత్రం దాదాపుగా మరో 20 ఏళ్ళపాటు ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లే సమయంలో మాస్కులను తప్పకుండా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా చేతులను నిత్యం శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవలని కూడా చెబుతున్నారు.అలాగే మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ విటమిన్లు, ప్రోటీన్లు, సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలని లేకపోతే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుందని ఇలా జరిగితే చాలా తొందరగా జబ్బుల బారిన పడే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube