మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ మొరాయిస్తుందా..? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!

ప్రస్తుతం మనలో చాలా మందికి వారు వాడుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఒక్కొకసారి బాగా స్లో అయిపోవడం గమనిస్తూ ఉంటాం.ఏదైనా ఓపెన్ చేసి పని చేసుకోవాలని అనుకుంటే ఫోన్ అసలు పని చేయకపోవడం మనం గమనిస్తూనే ఉంటాం ఇలాంటి సమయాల్లో ఫోన్ ఉపయోగించేవారికి చాలా అసహనం వ్యక్త పరుస్తుంటారు.

 Follow These Tips If You Are Troubling With Your Smartphone , Mobile Phone, Cach-TeluguStop.com

ఇందులో భాగంగానే చాలామంది వాడుతున్న ఫోన్ పక్కన పెట్టేసి కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి డబ్బు వృధా చేస్తూ ఉంటారు.ఇలా కొత్త ఫోన్ జోలికి వెళ్లకుండా పాత ఫోన్ ని స్పీడ్ గా పని చేసేందుకు కొన్ని విధానాలను ప్రయత్నిస్తే మన స్మార్ట్ ఫోన్ స్పీడ్ గా పని చేయడం గమనించవచ్చు.

అవేంటో ఒకసారి చూద్దామా.

మొదటిగా ఫోన్ హ్యాంగ్ ఎక్కువగా అవుతున్న సమయాల్లో ముందుగా చేయాల్సిన ట్రిక్ మొబైల్ ఫోన్ రీస్టార్ట్ చేయడమే.

దీనికి కారణం ఇలా చేయడం ద్వారా బ్యాక్ గ్రౌండ్ లో ఏదైనా మెమొరీ క్లీన్ అవ్వడం.అలాగే ఏదైనా బ్యాక్ గ్రౌండ్ యాప్స్ పని చేయకపోతే అది కూడా ఫిక్స్ అవుతాయి.

అలా చేసిన తర్వాత ఫోన్ రీస్టార్ట్ అయ్యాక మీ ఫోన్ లోని క్యాచీ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి.ఇలా క్యాచీ మెమొరీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడం ద్వారా అది ర్యామ్ పై ఎఫెక్ట్ పడకుండా చూపుతుంది.

ఇలా ర్యామ్ పై ఎఫెక్ట్ పడకపోతే మీ మొబైల్ చురుకుగా పని చేస్తోంది.

మొబైల్ హ్యాంగ్ కాకుండా ఉండేందుకు మీ ఫోన్లో అవసరంలేని యాప్స్ ను ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటే మెమొరీ స్పేస్ నిండకుండా ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకి సులువుగా ఉండేందుకు సహాయపడుతుంది.

Telugu Android Phone, Androidphone, Apps, Cache Memory, Speed, Phone, Smart Phon

అంతేకాకుండా ఉన్న యాప్స్ ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్ లకి అప్డేట్ చేయడం ద్వారా కూడా మీ మొబైల్ లో ఉన్న యాప్స్ బగ్స్ ఫిక్స్ అవ్వడంతో ఆ ఫోన్ పర్ఫామెన్స్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది.అలాగే వీటితో పాటు విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ లాంటివి మీ మొబైల్ యొక్క మెమరీని లాగేస్తాయి.కాబట్టి యానిమేషన్స్ ను మొత్తంగా ఆఫ్ చేస్తే మంచిది.వీటితో పాటు మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ బ్రాండ్ కంపెనీ ఆ బ్రాండ్ యొక్క ROM లను వాడుతూ ఉంటాయి.

ఇలా చేయడం ద్వారా ఒక్కసారి మీ ఫోన్ స్లో అవ్వటానికి దోహదపడతాయి.అలాంటప్పుడు మీరు కొన్ని కస్టమ్ ROM కూడా ఉపయోగించుకోవచ్చు.ఇలా చేయడం ద్వారా ఫోన్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫోన్స్ స్పీడ్ గా పని చేయడానికి అవకాశం ఉంటుంది.ఇవన్నీ చేసినా కానీ ఫోన్ ఇంకా స్లోగా ఉందంటే మీ ఫోన్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి వాడుకోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube