గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎంలకు పోటీగా 'బజాజ్ పే' సేవలు ..?

ఇప్పటివరకు మనం అమెజాన్ పే, పేటీఎం, ఫోన్ పే లాంటి విభిన్న డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ఫామ్స్ ను మనం చూసాము.అయితే ఈ రంగంలోకి కొత్తగా బజాజ్ ఫైనాన్స్ తన సర్వీసులను మొదలుపెట్టబోతుంది.

 Bajaj Pay' Services To Compete With Google Pay, Phone-pay, Paytm   Bajaj Finance-TeluguStop.com

అతి త్వరలోనే భారతదేశంలో బజాజ్ పే సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి బజాజ్ ఫైనాన్స్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీపీఐ అనుమతులు కూడా ఇచ్చేసింది.

ఈ సందర్భంగా అతి త్వరలోనే బజాజ్ పే సంబంధించి కొత్త సేవలు భారతదేశంలోని ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి.సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రస్తుతం ఉన్న పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ లాగా బజాజ్ ఫైనాన్స్ కూడా ప్రీపెయిడ్ పేమెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది.దీంతో అతి త్వరలోనే బజాజ్ ఫైనాన్స్ తన బజాజ్ పే సర్వీసులను దేశంలో లాంచ్ చేయబోతోంది.

ఒకవేళ బజాజ్ పే సర్వీసులు దేశంలో మొదలైతే ప్రస్తుతం ఉన్న గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ లాంటి ఆర్థిక లావాదేవీల డిజిటల్ ప్లాట్ ఫామ్లో పోటీని ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది.

Telugu Bajaj, Bajaj Pay, Upi-Latest News - Telugu

ఇకపోతే ఈ బజాజ్ పీపీఐ సర్వీసులను భారతదేశంలో శాశ్వతంగా కొనసాగించేందుకు ఆర్బిఐ బజాజ్ ఫైనాన్స్ నిర్వహించబోయే బజాజ్ పే సర్వీసులను శాశ్వతంగా కొనసాగించేందుకు ఆర్.బి.ఐ అన్ని అనుమతులను ఇచ్చేసింది.దీంతో ఇదివరకు లాగా ప్రతి ఏటా ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మొదలైతే వాటి సేవలు నిరంతరాయం కొనసాగించవచ్చు.దీంతో బజాజ్ ఫైనాన్స్ అతిత్వరలోనే పీపీఐ సర్వీసులను లాంచ్ చేయబోతోంది.

దీంతో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లయితే కస్టమర్లు వారి యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు కొనసాగించవచ్చు.కేవలం ఆర్‌బీఐ నుండి మాత్రమే కాకుండా మిగతా అనుమతులు కూడా బజాజ్ ఫైనాన్స్ కు ఇప్పటికే అందినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube