సంగం డెయిరీ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..!!

టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర సంగం డైరీ లో అవినీతికి పాల్పడినట్లు అక్రమాలు చేసినట్లు ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేయటం తెలిసిందే.ఇదే క్రమంలో రాష్ట్రప్రభుత్వం సంగం డైరీ ని స్వాధీనంలోకి తీసుకుంటూ జీవో జారీ చేసింది.

 High Court Shocks Ap Government Over Sangam Diary Case Tdp, High Court, Sangam D-TeluguStop.com

దీంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాని సవాలు చేస్తూ డైరీ కి సంబంధించి డైరెక్టర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ సందర్భంగా నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వం.

సంగం డైరీ ని స్వాధీనం చేసుకోవడాని తప్పుబట్టింది. డైరీ ని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఈ క్రమంలో యధావిధిగా సంగం డైరీ.కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని.

స్పష్టం చేసింది.అంతమాత్రమే కాకుండా రోజువారీ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డైరెక్టర్లకు సూచించింది.

డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది.అదే విధంగా సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.

ప్రస్తుతం ఆయనకు పాజిటివ్ కావడంతో కస్టడీ పొడిగింపు ఈ విషయం పై ఏసీబీ కోర్టు విచారణ చేయాలని హైకోర్టు తెలిపింది.తాజా పరిణామాలతో ఏపీ ప్రభుత్వానికి సంగం డైరీ విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చినట్లు అయ్యింది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube