వామ్మో : కుక్క కడుపులో 30 చేతి తొడుగులు..?!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.దీంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు.

 Vammo: 30 Gloves On A Dog's Stomach , Dog, Stomach, Ppe Kits, Hand Gloves, Docte-TeluguStop.com

ఆక్సిజన్, బెడ్లు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది రోజూ ప్రాణాలు విడుస్తున్నారు.వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు వాడటం వల్ల కరోనా నుంచి రక్షణ పొందుతున్నారు.

అయితే ఇక్కడొక వ్యక్తికి తమ కుక్క చేయకూడని పని చేసింది.దీంతో ఆ వ్యక్తి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

కుక్కే కదా ఏం చేయదులే అనుకున్న అతనికి ఆ కుక్క ఓ తప్పు చేసింది.దీంతో అతడు అవాక్కయ్యాడు.

ఓ వ్యక్తికి పీపీఈ చేతి గ్లౌజులు వాడటం అలవాటు.కరోనా టైంలో బయటకు వెళ్లాలన్నా చేతి గ్లౌజులు ధరించే అతడు వెళ్తాడు.

అయితే ఆ వ్యక్తి చేసిన పనికి తన పెంపుడు కుక్క ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది.యజమాని కారులో దాచుకున్న 30 పీపీఈ చేతి గ్లౌజులను తన పెంపుడు కుక్క ఇష్టంగా తినేసింది.

ఈ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.

రోజూలాగే తన కారులో ఆ వ్యక్తి పీపీఈ చేతి గ్లౌజులను ఉంచాడు.

అయితే ఆ యజమాని లేని సమయంలో తన పెంపుడు కుక్క కారులోకి చేరుకుని పీపీఈ గ్లౌజులను తినేసింది.దాదాపు 30 పీపీఈ చేతి గ్లౌజులను ఆ కుక్క ఇష్టంగా తినింది.

దీంతో ఆ కుక్క మొదట్లో మామూలుగానే ఉన్నా రానురాను అనారోగ్యపాలు అయ్యింది.డారెన్ క్నోయ్ అనే వ్యక్తి పెంచుకుంటున్న రాట్​వైలర్​ జాతి మగ శునకం రాంబో అనారోగ్యానికి గురవడం వల్ల వేక్​ఫీల్డ్​లోని పశువైద్య కేంద్రానికి తీసుకొచ్చారు.

మొదట్లో వైద్యులు ఆ కుక్కను చూసి ఏమైందో తెలియక నానాతంటాలు పడాల్సి వచ్చింది.ఆతర్వాత వైద్యులు శునకానికి ఎండోస్కోపీ చేశారు.

దీంతో అసలు విషయం బయటపడింది.కుక్క కడుపులో చేతి తొడుగులను బయటకు తీశారు.

బ్రిటన్​లోని పశువైద్యులు మూడు గంటలపాటు శ్రమించి వాటిని బయటకు తీయాల్సి వచ్చింది.ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube