వైరల్ : 10 సంవత్సరాల చిన్నారి ప్రతిభకు ప్రపంచ రికార్డు..!

ఒకప్పుడు ఎవరి ఫోన్‌ నంబర్‌ అయినా తడుముకోకుండా టకటకా చెప్పేవాళ్లం.స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక ఇంట్లో వాళ్ల నంబర్లు కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో ప్రపంచ దేశాల పేర్లు, వాటి రాజధానులు, అక్కడ వినియోగించే కరెన్సీ పేర్లను గుక్కతిప్పుకోకుండా చెబుతోంది పదేళ్ల సారా ఛిపా.

 Viral 10 Years Old Girl Sara Sets World Record By Remembering 196 Countries Capi-TeluguStop.com

భారత సంతతికి చెందిన సారా ఇటీవల జరిగిన వరల్డ్‌ రికార్డ్స్‌ పోటీలో పాల్గొని 196 దేశాల పేర్లు, రాజధానులు, ఆయా దేశాల్లో వాడే కరెన్సీ పేర్లను అవలీలగా చెప్పి వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది.ఇప్పటిదాకా ఈ రికార్డు సాధించిన వారంతా దేశాల పేర్లు వాటి రాజధానుల పేర్లు మాత్రమే చెప్పగా సారా వీరందరికంటే ఒక అడుగు ముందుకేసి ఆయా దేశాల కరెన్సీల పేర్లు కూడా చెప్పడం విశేషం.

గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఓఎమ్‌జీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సారా అన్ని దేశాల కరెన్సీ, రాజధానుల పేర్లు కరెక్టుగా చెప్పి వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంది.కాగా ఈవెంట్‌ను యూట్యూబ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్‌ మాధ్యమాలలో లైవ్‌ టెలికాస్ట్‌ చేశారు.

రాజస్థాన్‌లోని భిల్వారా సారా స్వస్థలం. తల్లిదండ్రులు ఇద్దరూ వృత్తిరీత్యా గత తొమ్మిదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు.సారాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.జెమ్స్‌ మోడరన్‌ అకాడమీలో ఆరోతరగతి చదువుతోన్న సారా 1500 గంటలకు పైగా సాధన చేసి ఈ కేటగిరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచింది.

సారా వరల్డ్‌ రికార్డులో పాల్గొనాలని మెమరీ టెక్నిక్స్‌ నేర్చుకోలేదు.లాక్‌డౌన్‌ సమయంలో జ్ఞాపకశక్తి, సృజనాత్మకు పదును పెట్టేందుకు ముంబైకు చెందిన ‘బ్రెయిన్‌ రైమ్‌ కాగ్నిటివ్‌ సొల్యూషన్‌’ వ్యవస్థాపకులు సుశాంత్‌ మీసోర్కర్‌ వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.

కొన్ని సెషన్ల తరువాత సారాలో చురుకుదనం గమనించిన సుశాంత్‌ ఆమెకు మరింత ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వరల్డ్‌ రికార్డు పోటీలో పాల్గొనేందుకు ప్రేరేపించారు.ప్రారంభంలో 585 పేర్లను గుర్తు పెట్టుకోవడానికి సారాకు గంటన్నర పట్టేది.

సాధన చేస్తూ కేవలం 15 నిమిషాల్లోనే పేర్లను చెప్పగలిగేది.మూడు నెలల పాటు ఎంతో కష్టపడి క్రియేటివ్‌ లెర్నింగ్, మెమరీ టెక్నిక్‌ల ద్వారా దేశాల రాజధానులు, కరెన్సీ పేర్లను గుర్తుపెట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube