ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే.. !

కరోనా భయంతో ప్రయాణాలు చేసే వారు చాలా తక్కువైపోయారు.సొంత వాహనాలు ఉన్న వారు మాత్రం వారి వారి వాహనాలను ఉపయోగించుకుంటు పనులు ఒడ్డెక్కించుకుంటున్నారు.

 South Central Railway Cancels 28 Special Trains , South Central Railway, Cancels-TeluguStop.com

ఇక ఈ కరోనా దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్దలు నష్టాలబాట పడుతుండగా, దక్షిణమధ్య రైల్వే కూడా ఇదే దారిలో నడుస్తుంది.

కోవిడ్ అంటే ఉన్న భయం వల్ల ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.28 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లుగా పేర్కొంది.కాగా నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

రద్దు అయిన రైళ్లలో నేడు నడవాల్సిన తిరుపతి-విశాఖపట్టణం, సికింద్రాబాద్-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-రేణిగుంట, విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-గూడూరు, నాందేడ్-జమ్ముతావి, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, నర్సాపూర్-నాగర్‌సోల్, సికింద్రాబాద్-విజయవాడ, విజయవాడ-సికింద్రాబాద్, హైదరాబాద్-సిర్పూరు కాగజ్‌నగర్, సిర్పూరు కాగజ్‌నగర్-సికింద్రాబాద్, విశాఖ-తిరుపతి, రేణిగుంట-కాకినాడ టౌన్, లింగంపల్లి-విజయవాడ, తిరుపతి-కరీంనగర్, గూడూరు-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్టణం, సిర్పూరు కాగజ్‌నగర్-సికింద్రాబాద్, నాగర్‌సోల్-నర్సాపూర్ రైళ్లు, 9న నడిచే కాకినాడ టౌన్-లింగంపల్లి, కరీంనగర్-తిరుపతి, జమ్ముతావి-నాందేడ్, విశాఖపట్టణం-సికింద్రాబాద్, 10న నడిచే లింగంపల్లి -కాకినాడ టౌన్ మొదలగు రైళ్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.ఇక కోవిడ్ నిబంధనల ప్రకారం ఇక నుండి వెయింటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులను అనుమతించరని, అన్‌రిజర్వుడు కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే వీరిని అనుమతిస్తారని తెలియచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube