ఇండియాలో విడుదలకు సిద్ధం అవుతున్న ఎంఐ ఫాస్ట్ ఛార్జర్..!?

మన భారతదేశ మార్కెట్లో ఎంఐ స్మార్ట్ ఫోన్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది.

 Mi 67 Watt Fast Charger Is All Set To Release In India , Mi Fast Charger, Mi11 U-TeluguStop.com

అందుకు ఎంఐ సంస్థ కూడా వివిధ ప్రొడక్ట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తూ ఉంది.తాజాగా ఎంఐ సంస్థ నుంచి ఫాస్ట్ చార్జర్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 67w ఫాస్ట్ ఛార్జర్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ విషయాన్ని షియోమి సంస్థ అధికారికంగా తెలియజేసింది.

అయితే గత నెలలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లో విడుదలైన సంగతి అందరికి తెలిసిన విషయమే.అయితే విడుదల సమయంలో షియోమి ఎంఐ 11 అల్ట్రా ఫోన్ బాక్స్ లో 67 w ఫాస్ట్ చార్జర్ కు బదులుగా 55W అడాప్టర్ ఇస్తున్నట్లు తెలియజేసింది.

దాని వలన 0-99 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు గంట సమయం పట్టేది.కానీ ప్రస్తుతం విడుదల చేసిన ఫాస్ట్ చార్జర్ తో మునిపటి కంటే అరగంట వేగంగా ఛార్జింగ్ చేసేందుకు సహాయపడుతుంది.

అయితే వినియోగదారులు ఈ వైర్డ్ ఛార్జర్‌ ను ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉందని షియోమి పేర్కొంది.దీనిని అతి త్వరలోనే భారత్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.కానీ పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా  ప్రకటించలేదు.అలాగే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 67W వైర్లెస్ ఛార్జర్‌ కు కూడా సహాయపడుతుందని, అలాగే ఇతర డివైజ్‌ లను కూడా 10W వేగంతో ఛార్జింగ్ చేసేందుకు ఈ ఫాస్ట్ చార్జర్ సహాయపడుతుందని షియోమి పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube